Bihar elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే పార్టీలో పొత్తులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 243 సీట్లకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తుంగా, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలు ఎన్డీయే మిత్రపక్షాలకు దక్కాయి.
Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో ఏదో జరుగుతోంది. సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఏకంగా 14 మంది కీలక సైనిక అధికారులను అరెస్ట్ చేయడంతో పాటు, మేజర్ జనరల్ అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. నివేదికల ప్రకారం, అక్టోబర్ 08న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ICT) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో […]
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
Pakistan: భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్‌కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు పాక్, ఆఫ్ఘన్ల మధ్య ఎప్పటి నుంచి సరిహద్దు వివాదం ‘‘డ్యూరాండ్ రేఖ’’తో ముడిపడి ఉంది.
Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో ఏడాది మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి క్యాంపస్ బయటకు రాగా, కొంత మంది నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.