Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
- రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
- బస్సుకు నిప్పంటుకుని 15 మంది సజీవ దహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 19 మంది సజీవ దహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Read Also: Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
సమాచారం ప్రకారం, జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేలోని థాయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. జైసల్మేర్ ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు 20 కి.మీ దూరంలో బస్సు వెనక నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు స్పందించే లోపే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి.
ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు అద్దాలను పగటగొట్టి బయటకు దూకారు. చాలా మంది ప్రయాణికులు బ్యాగులు, వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయకచర్యల్ని ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సు ఇంజన్, లేదా వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. గవర్నర్ హరిభావు బగాడే, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ , ఇతర నాయకులు ఈ విషాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
#WATCH | Rajasthan: A Jaisalmer-Jodhpur bus burst into flames in Jaisalmer. Fire tenders and Police present at the spot. pic.twitter.com/8vcxx5ID1q
— ANI (@ANI) October 14, 2025
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!