Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. ఎన్నికల ముందు డీఎంకే “భాషా” సెంటిమెంట్
- ఎన్నికల ముందు డీఎంకే ‘‘భాషా’’ సెంటిమెంట్..
- హిందీ బ్యాన్‌పై బిల్లు తీసుకువస్తున్న స్టాలిన్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.
Read Also: Diwali 2025 Offers: దీపావళి బిగ్ ఆఫర్.. ఒకే ధరకు ఐఫోన్ 15, ఐఫోన్ 13!
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఈ బిల్లు తమిళనాడు అంతటా హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది రాజ్యాంగానికి లోబడి ఉంటుందని డీఎంకే వర్గాలు చెబతున్నాయి. డీఎంకే సీనియర్ నేత టీకెఎస్ ఎలంగోవలన్ ఈ బిల్లుపై వ్యాఖ్యానిస్తూ..“మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము దానికి కట్టుబడి ఉంటాము. హిందీని విధించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము” అని అన్నారు. అయితే, బీజేపీ నేత వినోజ్ సెల్వం ఈ చర్యను మూర్ఖత్వంతో కూడుకున్నదిగా అభివర్ణించారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు.
తిరుపరంకుండ్రం, కరూర్ దర్యాప్తు వంటి సంబంధిత సమస్యల్ని మళ్లించేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి భాష సెంటిమెంట్‌ని రేకెత్తించాలని డీఎంకే చూస్తోందని పలువురు చెబుతున్నారు. ఇన్నాళ్లు డీఎంకే, ఏఐడీఎంకే మధ్యలోనే పోటీ నెలకొని ఉండేది. ఈ సారి మాత్రం విజయ్ టీవీకే రూపంలో ఎంట్రీ ఇవ్వడంతో పోరు త్రిముఖంగా మారింది. విజయ్‌కి వస్తున్న స్పందన చూసి ఒకింత డీఎంకే భయానికి లోనవుతుందని టీవీకే ఆరోపిస్తోంది.
- Tags
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!