Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో గందరగోళం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
New Electricity Bill: ఇన్నాళ్లు ప్రభుత్వమే మనకు విద్యుత్ అందించేది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశం వస్తోంది. మన మొబైల్ నెట్వర్క్లాగే, మనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకరి సర్వీస్ బాగా లేకుంటే, మరో సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎలాగైతే మనం ఒక నెట్వర్క్ నచ్చకుంటే, సిమ్ మార్చి వేరే నెట్‌వర్క్‌కు మారుతామే అచ్చం అలాగే.
BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దని ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ సలహా ఇచ్చారు. బీడ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీకి వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని, ఇంట్లో యోగా సాధన చేయాలని సూచించారు. కుట్ర జరుగుతోందని, ఎవరిని నమ్మాలో వారికి తెలియదని ఆయన అన్నారు.
Afghan -Pak War: పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తీవ్ర సరిహద్దు పోరాటం జరుగుతోంది. రెండు వైపుల కూడా పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. చివరక సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య 48 గంటల ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే, నిజంగా పూర్తిస్థాయిలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.
Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
Afghanistan Pakistan conflict, TTP attacks, Pakistan soldiers killed, Mir Ali suicide bombing, Waziristan terror attack, Kabul airstrike, Taliban Pakistan war, cross-border clashes, Afghanistan ceasefire
Afghan-Pak War: పాకిస్తాన్‌కు ఆఫ్ఘానిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తాలిబాన్ దళాలు, పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. డ్యూరాండ్ రేఖ వద్ద ఆఫ్ఘాన్ దళాలు పాక్ సైన్యానికి చెందిన పలు పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నాయి. పలువురు పాక్ సైనికుల్ని నిర్భందించి, కాబూల్‌కు తరలించింది. అంతే కాకుండా పాక్ సైన్యానికి చెందిన ట్యాంకుల్ని కాబూల్ తీసుకెళ్లి, ఊరేగించడం వైరల్‌గా మారింది.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థినిపై, మరో స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడితో ఆమెకు మూడు నెలల పరిచయం ఉంది. కాలేజీలో ఇద్దరూ కూడా ఒకే డిపార్ట్మెంట్కు చెందిన వారు.
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్‌ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి […]
Supreme court: ‘‘ఉరితీయడం’’ ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా, ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది.