Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
Read Also: Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?
ఆ సమయంలో భారత్ నేవీ అరేబియా సముద్రంలో మోహరించబడినట్లు రాజీవ్ ఘాయ్ తెలిపారు. మిలిటరీ యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘‘భారతదేశ నావికా దళం చాలా సిద్ధంగా ఉంది. బహుశా ఇది అందరికి తెలియకపోవచ్చు. అరేబియా సముద్రంలో నేవీ మోహరించబడింది. ’’ అని ఐక్యరాజ్యసమితి దళాల సహకార దేశాల (UNTCC) చీఫ్స్ కాన్క్లేవ్‌లో ఆపరేషన్ సిందూర్‌లో మాట్లాడుతున్న లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు.
ఒక వేళ పాకిస్తాన్ వినకపోయి ఉంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని ఆయన చెప్పారు. కేవలం సముద్రం నుంచే కాకుండా, ఇతర మార్గాల ద్వారా కూడా వారు పెను విపత్తును ఎదుర్కొనేవారని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా వ్యూహాలలో సిద్ధాంతపరమైన మార్పులు జరిగాయని చెప్పారు. భారత ప్రధాని మోడీ చెప్పి విషయాలను రాజీవ్ ఘాయ్ మరోసారి గుర్తు చేశారు. ఉగ్రవాద దాడుల్ని యుద్ధ చర్యగా భావిస్తామని, అణు బ్లాక్‌మెయిల్‌లకు ఇక లొంగేది లేదని, ఉగ్రవాదులు వారిని ప్రోత్సహించే వారి మధ్య ఎలాంటి తేడా చూపబోం అని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది.
#WATCH | Delhi | Director General Military Operations Lt Gen Rajiv Ghai says, "The Indian Navy was also in action… The Navy had sailed into the Arabian Sea and when the DGMO spoke, they were very well poised. Had the enemy decided to take it any further, it could have been… pic.twitter.com/lK5dhQkHY6
— ANI (@ANI) October 14, 2025