Trump: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అయితే, ట్రంప్‌కు నోబెల్ బహుమతి రాకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం స్పందించారు. ట్రంప్ శాంతి కోసం ఎంతో ప్రయత్నం చేశారని, ఉదాహరణగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ను చూపారు.
Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.
Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది.
Karwa Chauth: కర్వా చౌత్ ఉత్తరాది రాష్ట్రాలు నిర్వహించే ఓ హిందూ పండగ. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తుంటారు. పెళ్లి అయిన మహిళలు, తమ భర్త దీర్ఘాయుష్యు కోసం, ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఎలాంటి నీటిని తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. చంద్రుడిని చూసిన తర్వాత, భర్త చేతుల మీదుగా ఉపవాసాన్ని ముగిస్తారు.
Rare-earth minerals: అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
Bihar Elections: బీహర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 100 సీట్లలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం తెలిపింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. బీహార్‌లో తాము థర్డ్ ఫ్రండ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు […]
DONALD TRUMP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది.
Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం’’గా, పాకిస్తాన్‌ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.