Hanuman Flag: కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. మాండ్యా జిల్లాలో అధికారులు హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. జిల్లాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. గ్రామస్తులంతా ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలకు దిగారు. నిన్న ప్రారంభమైన ఈ ఆందోళనలు, ఈ రోజు కూడా కొనసాగించేందు ప్లాన్ చేశారు.
Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్వాడ్లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్‌ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Iran-Pakistan: ఇరాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సుపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్‌పై పాక్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్ లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో 9 మంది పాకిస్తాన్ జాతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Zelensky: రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. ఇరు వర్గాలు కూడా శాంతికి సిద్ధపడటం లేదు. మరోవైపు యుద్ధం కొనసాగించేందుకు ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సాయం కోరుతున్నారు. తాజాగా ఆయన జర్మనీ పర్యటనకు వెళ్లారు. అక్కడి స్టేట్ మీడియాతో మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం గురించి జర్మనీ ఛాన్సలర్ (ఓలాఫ్ స్కోల్జ్) తెలుసుకున్నట్లు నాకు అనిపిస్తోందని ఆయన అన్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలుమార్లు వెల్లడించారు.
DMK: జేడీయూ నేత, బీహార్ సీఎం ఇండియా కూటమి నుంచి, ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరారు. దీంతో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, డీఎంకేల నుంచి నితీష్ కుమార్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఇండియా కూటమి కోసం నితీష్ కుమార్ ‘‘హిందీ’’ని కూడా భరించామని ఆయన అన్నారు. ఇండియా కూటమిలో ఆయన సమస్యాత్మకంగా ఉన్నారని అన్నారు.
ICC: శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)పై విధించిన సస్పెన్షన్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడానికి ICC ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రోజు తక్షణమే శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. సస్సెన్షన్ నుంచి ఐసీసీ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఎల్సీ ఇకపై సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించదు’’ అని ప్రకటనలో పేర్కొంది.
Maldives: హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం మాల్దీవులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. భారతదేశంతో వివాదం, ప్రధాని నరేంద్రమోడీ గురించి ఆ దేశ మంత్రులు అసభ్యకరంగా మాట్లాడటం ఒక్కసారిగా వివాదాస్పదమైంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు అనుకూలంగా, భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్జాతీయ మీడియాలో మాల్దీవులు హెడ్‌లైన్‌గా మారింది.
Flat Sizes: దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భారతదేశంలోని టాప్-7 నగరాల్లో సగటున ‘ఫ్లాట్ సైజ్’ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్, కోల్‌కతా రెండు నగరాల్లోనే ఫ్లాట్ సైజ్ తగ్గింది.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్‌పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.