Indian Navy: భారత నేవీ దెబ్బకు మరోసారి సముద్ర దొంగల ప్రయత్నం విఫలమైంది. సోమాలియా తూర్పు తీరం వెంబడి మరో పైరసీ ప్రయత్నాన్ని అడ్డుకుంది. జనవరి 31న ఎంవీ ఒమారీ అనే ఇరానియన్ ఫ్లాగ్ కలిగి ఉన్న ఫిషింగ్ నౌకపై ఏడుగురు సముద్ర దొంగల దాడిని నిలువరించి పాకిస్తాన్, ఇరాన్ సిబ్బంది రక్షించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
Read Also: KTR: ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి.. కేటీఆర్ లేఖ
భారత నేవీకి చెందిన INS శారదా శుక్రవారం తెల్లవారుజామున సముద్ర దొంగల దాడికి గురైన ఓడను అడ్డగించి, ఒడలో ఉన్న 9 మందిని పాక్, 11 మంది ఇరాన్ సిబ్బందిని కాపాడింది. సముద్ర దొంగల్ని అడ్డుకునేందుకు నేవీ హెలికాప్టర్లు, పడవల్ని ఉపయోగించింది ‘‘ ఇండియన్ నేవీ నిర్విరామ ప్రయత్నాలు ద్వారా పైరసీ నిరోధక, సముద్ర భద్రతా కార్యకలాపాల, సముద్రంలో విలువైన ప్రాణాలను కాపాడుతుంది.’’ అని ఒక ప్రకటనలో ఇండియన్ నేవీ తెలిపింది.
ఈ ప్రాంతంలో గత 36 గంటల్లో నేవీ రెండు ప్రధాన రెస్క్యూ ఆపరేషన్లను చేసింది. 17 మంది ఇరాన్, 19 మంది పాకిస్తానీ జాతీయులతో సహా హైజాక్ చేయబడిన రెండు ఫిషింగ్ ఓడలు రక్షించింది. సోమవారం, సోమాలియా తూర్పు తీరంలో ప్రయాణిస్తున్న అల్ నయీమి అనే ఇరాన్ జెండాతో కూడిన ఫిషింగ్ ఓడపై పైరసీ ప్రయత్నాన్ని భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక INS సుమిత్ర అడ్డుకుంది. 19 మంది పాకిస్తాన్ జాతీయులను రక్షించింది. దీనికి ముందు ఐఎన్ఎస్ సుమిత్ర ఇరాన్ జెండా ఉన్న మరో చేపల వేట నౌక ఎఫ్‌వీ ఇమాన్‌ని పైరసీ బారి నుంచి కాపాడింది. సోమాలీ పైరెట్లను తరిమి కొట్టింది. ఈ ఘటనలో 17 మంది ఇరాన్ సిబ్బందిని ఇండియన్ నేవీ కాపాడింది. ఈ ఘటన సోమాలియా, గల్ఫ్ ఆప్ అడెన్ వద్ద జరిగింది.
#IndianNavy foils another #piracy attempt along East coast of #Somalia.
Info on Piracy attempt on #FVOmari monitored #31Jan 24. Vessel located successfully by Indian Naval RPA, undertaking surveillance in the area & #INSSharada on anti-piracy mission diverted to intercept. pic.twitter.com/XMUcP5gqTk
— SpokespersonNavy (@indiannavy) February 2, 2024