Vande Bharat Train: “వందేభారత్ ట్రైన్” భోజనంలో బొద్దింక.. స్పందించిన రైల్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలిచింది. గతంలో పలుమార్లు ఈ రైలులో వడ్డించిన భోజనంలో దుర్వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు రావడంపై రైల్వే శాఖ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఫిబ్రవరి 1న రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
Read Also: Uniform Civil Code Bill: యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
దీంతో షాకైన ప్రయాణికుడు దానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. డాక్టర్ శుభేందు కేశరి అనే ప్రయాణికుడు ఆర్డర్ చేసిన నాన్ వెజ్ భోజనంలో బొద్దింక ఉన్న దృశ్యాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక రావడంపై తాను ఆందోళన చెందానని కేశరి తన పోస్టులో రాశాడు.
ఈ ఘటనపై IRCTC వెంటనే స్పందించింది. దీనిపై ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందిస్తూ రైల్ మదాద్‌లో ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూలై నెలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోపాల్ నుండి గ్వాలియర్‌కు ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు IRCTC అందించే భోజనంలో బొద్దింకను చూసి షాక్ అయ్యాడు. రైల్వేకి ఫిర్యాదు చేశాడు.
I was travelling on 1/02/2024 train no. 20173 RKMP to JBP (Vande Bharat Exp)
I was traumatized by seeing dead COCKROACH in the food packet given by them.@narendramodi @AshwiniVaishnaw @drmjabalpur @wc_railway @Central_Railway @RailMinIndia @IRCTCofficial @fssaiindia @MOFPI_GOI pic.twitter.com/YILLixgLzj— डाॅ. शुभेन्दु केशरी ⚕️👨⚕️ (@iamdrkeshari) February 2, 2024
Sir, our sincere apology for the experience you had.The matter is viewed seriously, and the hefty penalty has been imposed on the concerned service provider. Moreover, monitoring has been strengthened at the source.
— IRCTC (@IRCTCofficial) February 3, 2024
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!