Terrorist arrest: ఆర్మీలో పనిచేసిన జవాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతడిని ఢిల్లీ పోలీసులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మంగళవారం పోలీస్ అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు రియాజ్ అహ్మద్ గత కొంత కాలంగా లష్కర్ ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలోని ఎల్‌ఈటీ మాడ్యుల్ చేధించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.
రియాజ్ అహ్మద్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి హ్యాండర్లతో సమన్వయం చేసుకుంటూ.. గులామ్ సర్వర్ రాథర్, అహ్మద్ రాథర్‌తో కలిసి జమ్మూ కాశ్మీర్‌లో విధ్వంసానికి కుట్ర పోలీసులు వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి లష్కర్ హ్యాండర్ల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అందుకునే కార్యక్రమంలో ఇతని పాత్ర కీలకంగా ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Read Also: Speaking English: బ్యాంగిల్స్ అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో వింటే ఆశ్చర్యపోతారు..!
ఇటీవల కాశ్మీర్‌లోని టెర్రర్ మాడ్యూల్ కేసును చేధించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి రియాజ్ పరారీలో ఉన్నాడు. తెల్లవారుజామున న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు రియాజ్‌ని గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రియాజ్ అతని స్నేహితుడు అల్తాఫ్‌తో కలిసి జబల్ పూర్ నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హజారత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లేందుకు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వస్తున్నాడని తెలుసుకుని అతడిని పోలీసులు పట్టుకున్నారు.