Election Commission: మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 18-29 ఏళ్ల మధ్య గల యంగ్ ఓటర్లు 2.63 కోట్ల మంది కొత్తగా ఓటర్ లిస్టులో చేరినట్లు వెల్లడించింది. వీరిలో 1.41 కోట్ల మంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు 1.22 ఉన్నారు.
Read Also: PM Modi: షాక్‌లో ఎంపీలు.. పార్లమెంట్ క్యాంటీన్‌లో ప్రధాని మోడీతో కలిసి లంచ్..
గత లోక్ సభ ఎన్నికలు జరిగిన 2019 నుంచి నమోదైన ఓటర్లలో 6 శాతం పెరుగుదల ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో ఓటర్లు.. 96.88 కోట్ల మంది భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈసీ తెలిపింది. 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి పెరిగిందని పోల్ ప్యానెల్ తెలిపింది.
మొత్తం ఓటర్లు- 96,88,21,926 (8-02-2024 నాటికి)
పురుషులు- 49,72,31,994
స్త్రీలు- 47,15,41,888
పీడబ్ల్యూడీ ఓటర్లు- 88,35,449
థర్డ్ జెండర్- 48,044
18-19 ఏళ్ల ఓటర్లు- 1,84,81,610
20-29 ఏళ్ల ఓటర్లు- 19,74,37,160
80 ఏళ్లకు పైన ఓటర్లు- 1,85,92,918