Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Read Also: Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
మా కూటమి పెరగాలని మేము ఎప్పుడు కోరుకుంటామని, కొత్త మిత్రులను ఎల్లప్పుడూ స్వాతిస్తామని, జన సంఘ్ నుంచి మా భావజాలంలో అలాగే ఉందని, మాతో చేరే వారు రావచ్చని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పారు. అకాళీదళ్ రీఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏదీ ఖరారు కాలేదని అన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న ఎస్ఏడీ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా 2020లో ఎన్డీయే నుంచి వైదొలిగింది. 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగిన తెలుగుదేశం(టీడీపీ) లేదా వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపే విషయంపై మాట్లాడుతూ.. కొంత కాలం తర్వాత అంతా తేలిపోతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి మరింత బలపడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ కూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేతో జతకట్టారు. ఆర్ఎల్డీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది.
బీజేపీ కూటమి నుంచి ఏ భాగస్వామి విడిపోవాలని ఎన్నడూ కోరుకోలేదని, రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలకే అవకాశం ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఎన్డీయే నుంచి కొందరు వెళ్లిపోగా.. కొత్త వారు వచ్చారని, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, కొన్ని సంఘటనల వల్ల కొన్ని పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!