Shiv Sena MLA: “మీ పేరెంట్స్ నాకు ఓటేయకుంటే రెండు రోజులు తినకండి”.. పిల్లలతో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena MLA: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఎమ్మెల్యే సంతోష్ బంగర్ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే మీరు రెండు రోజుల పాటు తినొద్దని కోరడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కలమ్‌నూరి ఎమ్మెల్యే అయిన సంతోష్ బంగర్ హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన సమయంలో ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 10 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటాన్ని అంతా తప్పుబడుతున్నారు.‘‘ ఒకవేళ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. సంతోష్ బంగార్‌కి ఓటేయండి, అప్పుడు మాత్రమే తింటాము’’ అని చెప్పాలని పిల్లల్ని ఎమ్మెల్యే కోరాడు.
Also Read
బంగార్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ కోరింది. అతను చేసిన వ్యాఖ్యలు ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ బంగర్‌పై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని కోరాడు మరియు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. బంగార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ తిరిగి ప్రధానిగా రాకపోతే ఉరి వేసుకుంటానని గత నెలలో అన్నాడు. గతేడాది ఆగస్టు నెలలో ఒక ఉత్సవ ర్యాలీలో కత్తిని చూపినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్న క్యాటరింగ్ మేనేజర్‌ని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..