Russia: భారత్‌ని మా నుంచి దూరం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్‌ని తమ నుంచి దూరం చేయాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా ఆరోపించింది. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోల్ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, మాస్కో మధ్య దీర్ఘకాల సంబంధాలకు అంతరాయం కలిగించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా తన మద్దతుని ప్రకటించింది.
వెస్ట్రన్ దేశాలు సెకండరీ ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయని, కొంతమంది భారతీయ భాగస్వాములు కొన్ని సార్లు జాగ్రత్త వహిస్తున్నారని, కానీ చాలా మంది వాటిని లెక్క చేయడం లేదని రష్యా రాయబారి అన్నారు. రష్యా, భారత్ భాగస్వామ్యానికి రక్షణ సహకారంగా ఉందని, ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా మారిందని డెనిస్ అలిపోవ్ చెప్పారు.
Also Read
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
Read Also: Nitin Gadkari : త్వరలో దేశ రహదారులు అమెరికా వాటిలా మారుతాయన్న నితిన్ గడ్కరీ
భారత్, రష్యాకి నమ్మకమైన, కాల పరీక్షకు నిలిచిన స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. భారత సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో రష్యా సహకారం ఉందని, ఇది ఇప్పటికీ కొనసాగుతోందని, వెస్ట్రన్ దేశాల మాదిరిగా మేము ఎప్పుడు కూడా ఇక్కడి రాజకీయాల్లో షరతులు పెట్టలేదని, దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, పరస్పర గౌరవ, విశ్వసనీయ సంబంధాలను కొనసాగించామని అన్నారు.
భారత్ నాలుగు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో రష్యా ఒకటని, భారత్ దిగుమతుల్లో మూడో వంతు కంటే ఎక్కువ హైడ్రోకార్బన్లు రష్యా నుంచే వస్తున్నాయని చెప్పారు. ఎరువులు, వజ్రాల రంగంలో ఇరు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం ఉందని చెప్పారు. సాంకేతిక బదిలీ, జాయింట్ వెంచర్ల ద్వారా Su-30MKI యుద్ధ విమానాలు, T-90 ట్యాంకులు మరియు AK-203 అసాల్ట్ రైఫిల్స్ వంటివి తయారు చేస్తున్నామని, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇరు దేశాల మధ్య గర్వించదగిన విషయమని రష్యా రాయబారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..