Farmers’ protest: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్ చేయనున్నాయి.
Read Also: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 28,000 దాటిన మృతుల సంఖ్య..
ఇదిలా ఉంటే, రైతు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని 7 జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాన్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాలో ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్, అన్ని డాంగిల్ సేవల్ని నిలిపేస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ కట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13 రాత్రి 12 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్ అడ్డుకునేందుకు అంబాలా, జింద్,ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్-హర్యానా మధ్య సరిహద్దులపై భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.