Farmers Protest: తన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ, రైతులు ఢిల్లీ ముట్టడికి పిలపునిచ్చారు. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పాటు రైతులకు, రైతు కూలీలకు ఫించన్లు, లఖీంపూర్ ఖేరీ బాధితులకు ఆర్థిక సాయం వంటి పలు రకాల డిమాండ్లతో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి బయలుదేరారు. ఇదిలా ఉంటే, వీరిని అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించాయి. నిన్నటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్‌లను పోలీసులు ప్రయోగించి వారిని అడ్డుకుంటున్నారు.
Domestic Violence: తన భర్త, అత్తామామలపై భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేసింది. మహిళ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి తన తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబడదని చెప్పింది. అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి కోర్టు) ఆశిష్ అయాచిత్, మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో.. మహిళ ఫిర్యాదు అస్పష్టంగా ఉందని, భర్త, అత్తామామలు గృహ హింస…
Dentist: కేరళలో ఓ పెషేంట్‌కి బాగున్న దంతాలను పీకేశాడు ఓ డెంటిస్ట్. చికిత్స చేయించుకునే సమయంలో 5 దంతాలను దెబ్బతీసినందుకు రూ. 5 లక్షలు జరిమానాగా కట్టాలని దంత వైద్యుడిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశించింది. డెంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షైనీ ఆంటోనీ రౌఫ్ వట్టుకులానికి చెందిన కే ఆర్ ఉషా కుమారికి పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో కమీషన్ పేర్కొంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్పై ప్రశంసలు కురిపించారు. నా ‘సోదరుడు’ అంటూ సంబోధించారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. యూఏఈ ప్రెసిడెంట్‌తో చర్చల తర్వాత అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ‘ అల్హన్ మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తాను తొలిసారి ప్రధాని అయిన తర్వాత 2015లో యూఏఈ పర్యటనను ప్రధాని గుర్తు చేసుకున్నారు.
Odisha: చనిపోయిందని భావించి, అంత్యక్రియలకు సిద్ధమైన తరుణంలో మళ్లీ ప్రాణాలు పోసుకున్న ఘటనలు ఇది వరకు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ 52 ఏళ్ల మహిళను కాసేపైతే చితిపైకి తీసుకెళ్తారనే సమయంలో కళ్లు తెరవడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ పట్టఠనంలో ఈ సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు.
MSP: కేంద్రం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. 200 రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత తలెత్తింది. పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ వైపు ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో బారికేడ్లు, ముళ్ల కంచెల సాయంతో పోలీసులు, కేంద్ర బలగాలు వీరిని అడ్డుకున్నాయి.
PM Surya Ghar Yojana: ‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ’’పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం రూఫ్టాఫ్ సోలార్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 75,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. సబ్సీడీలు, భారీ రాయితీలను నేరుగా ప్రజల ఖాతాలకు చేరేలా కేంద్రం భరోసా ఇస్తోంది.
Shah Rukh Khan: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ కేసులో భారత్ దౌత్యపరంగా ఖతార్‌పై ఒత్తిడి తీసుకురావడంతో 8 మందిని ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదలతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సాయం చేశారని, వారి విడుదలకు ఖతార్ ప్రభుత్వాన్ని ఒప్పించారని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ‘‘ఖతార్‌లో షేక్‌లను భారత విదేశాంగా శాఖ, ఎన్ఎస్ఏ ఒప్పించడంలో విఫలం కావడంతో, ప్రధాని మోడీ, షారూఖ్ ఖాన్…
INDIA bloc: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తుల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా కూటమిలో విబేధాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఆప్ కూడా అదే దారిలో వెళ్తోంది.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో "సందేశ్‌ఖాలీ" ప్రకంపనలు రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్ర హింసలకు గురైన మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. సోమవారం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తాము ఎదుర్కొన్న అఘాయిత్యాలు., అన్యాయాల గురించి గవర్నర్ వద్ద వెల్లబోసుకున్నారు.