Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ విచారించారు. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారని కమిటీ తరుపున వాదిస్తున్న ఎస్ఎఫ్ఏ నఖ్వీ తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఖతార్ వెళ్లారు. ఇటీవల ఖతార్‌లో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, భారత్ దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకురావడంతో ఖతార్ దిగి వచ్చి వారందర్ని విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా ఇండియా చేరుకున్నారు.
Mimi Chakraborty: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, మిమీ చక్రవర్తి తన ఎంపీ పదవకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో సహా 12 కీలక డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో దేశ రాజధానిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రయత్నాలను పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయి. హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల్ని, నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలను ఉంచి రైతులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉంటామని భావించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విబేధాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. సీట్ల షేరింగ్‌లో కాంగ్రెస్ వైఖరిని నిందించాయి. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందా.? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఆప్ పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పెద్దగా స్పందించడం లేదు.
Tamil Nadu: తమిళనాడులో బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. మధురైలో బీజేపీ ఓబీసీ విభాగం నేత గురువారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని శక్తివేల్‌గా గుర్తించారు. బీజేపీ ఓబీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఈయన గురువారం ఉదయం ఫైనాన్సింగ్ పనిలో నిమగ్రమై ఉండగా.. సాంగు నగర్‌లోని గోదాం వద్దకి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వీరిపై అక్కడి మహిళలు చీపుళ్లు, కర్రలతో ఎదురుతిరిగారు. దీంతో ఒక్కసారిగా ఈ చిన్న గ్రామం జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా మారింది. మహిళలు, యువకులు చేస్తున్న ఈ ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ చీఫ్ మజుందార్, ఇతర నేతలు టీఎంసీ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
BJP: లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్‌సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది.
Vikram Batra: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత్ బాత్రా(77) కన్నుమూశారు. ఆప్ మాజీ నేత అయిన కమల్ కాంత్ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లో మరణించారు. ఆమె మరణానికి హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎక్స్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి శ్రీమతి కమల్‌కాంత్ బత్రా మరణం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మృతుల కుటుంబానికి అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అంటూ ఆయన ఎక్స్…
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ,…