Farmers protest: పంటలకు మద్దతుధర(ఎంఎస్పీ)తో సహా 12 హమీలను అమలు చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు ఆందోళన చేపట్టారు. ‘ఢిల్లీ ఛలో’పేరుతో మార్చ్ నిర్వహించారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. మరోవైపు రైతులతో కేంద్ర మంత్రులు పలుమార్లు చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
Arvind Kejriwal: ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఆప్ అతిపెద్ద ముప్పుగా ఉందని, అందుకే తమ పార్టీపై, నేతలపై అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను అనేక దాడుల్ని ఎదుర్కొంటున్నానని, ఇప్పుడు తనను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని, తనను అరెస్ట్ చేసినా, తన ఆలోచనల్ని…
Kamal Nath: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కీలక నేతలు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించడం వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఈ రోజు కమల్ నాథ్ న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడే బీజేపీ…
Tejashwi Yadav: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమతో పొత్తు పెట్టుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్‌ని క్షమించాలని కోరాడని ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ అన్నారు. 2022లో పొత్తు పెట్టుకోవడానికి ముందు లాలూను గత ద్రోహాన్ని మరిచి క్షమించాలని కోరాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెలలో నితీష్ కుమార్ ఆర్జేడీ పొత్తును కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాడు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది.
Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.
UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యలకు పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్ ఒక నివేదికలో పేర్కొంది.
Baba Vanga: బాబా వంగా గురించి తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త అంచనా వేసిన భవిష్యత్ సంఘటనలు నిజమవుతున్నాయి. 2024లో ఆమె అంచనా వేసిన సంఘటనలు నిజమవుతున్నాయి. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని పిలిచే బాబా వంగా, 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు మరియు బ్రెక్సిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలను ముందే అంచనా వేశారు. తాజాగా ఆమె అంచనా వేసినట్లు 2024లో జపాన్, యూకే వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో…
India's defence: భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంపొందించేలా, ఢిపెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ₹ 84,560 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపానదల్లో యాంటి ట్యాంక్ మైన్స్, హెవీ వెయిట్ టార్పిడోలు, మల్టీ మిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు ఉన్నాయి. వీటికి రక్షణ మంత్రి శాఖ అనుమతి లభించింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ కొనుగోళ్లకు శుక్రవారం పచ్చజెండా ఊపింది.