Sandeshkhali: టీఎంసీ నేతలే బీజేపీ లక్ష్యం.. సందేశ్‌ఖలీ అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణమన్న మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వీరిపై అక్కడి మహిళలు చీపుళ్లు, కర్రలతో ఎదురుతిరిగారు. దీంతో ఒక్కసారిగా ఈ చిన్న గ్రామం జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా మారింది. మహిళలు, యువకులు చేస్తున్న ఈ ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ చీఫ్ మజుందార్, ఇతర నేతలు టీఎంసీ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
Read Also: Sivakarthikeyan: శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ సినిమా షూటింగ్ ప్రారంభం..
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
ఇదిలా ఉంటే, సందేశ్‌ఖలీపై టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ ప్రాంతంలో అశాంతికి ఆర్ఎస్ఎస్ కారణమని దుయ్యబట్టారు. బీజేపీ లక్ష్యం కేవలం టీఎంసీ లీడర్లే అని అన్నారు. ఈ కేసులో నిందితులుగా తేలితే తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నేను ఎవరికీ అన్యాయం జరగనివ్వనని ఆమె అన్నారు. సందేశ్‌ఖలీకి తమ ప్రభుత్వం మహిళా కమిషన్‌ని పంపిందని, పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, 17 మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
షేక్ షాజహాన్ అకృత్యాలకు నిరసనగా వరసగా ఏడో రోజు సందేశ్‌ఖలీలో ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం బీజేపీ చీఫ్ మజుందార్ మహిళలకు సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో ఆయనకు గాయాలయ్యాయి. షాజహాన్, అతని అనుచరులు బలవంతగా ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకుని, మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపించారు. రేషన్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు సందర్భంగా అధికారులపై జనవరి 5న షేక్ షాజహాన్ అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత నుంచి అతను పరారీలో ఉన్నాడు. బంగ్లాదేశ్ పారిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతనికి రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం, సీఎం మమతా మద్దతు ఇస్తోందని బీజేపీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?