Vikram Batra: కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Batra: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత్ బాత్రా(77) కన్నుమూశారు. ఆప్ మాజీ నేత అయిన కమల్ కాంత్ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లో మరణించారు. ఆమె మరణానికి హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఎక్స్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి శ్రీమతి కమల్‌కాంత్ బత్రా మరణం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మృతుల కుటుంబానికి అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు.
కమల్ కాంత్ బాత్రా 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్ నుంచి ఆప్ తరుపున ఎంపీగా పోటీ చేశారు. అయితే, ఆప్ పనితీరు, సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని నెలల క్రితం పార్టీని వీడారు. ప్రధాని మోడీ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని,తన వాగ్దానాలన్నింటిని నేరవేర్చాలని ఆదే తన సూచన అని అన్నారు.
Also Read
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
Read Also: Sonia Gandhi: కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుంది.. సోనియా గాంధీ రాజ్యసభ సీటుపై బీజేపీ..
కార్గిల్ యుద్ధంలో వీరోచిత పోరాటంలో వీర మరణం పొందిన కెప్టెన్ విక్రామ్ బాత్రా(24) తల్లిగా ఆమె అందరికి సుపరిచితం. 1999లో పాకిస్తాన్‌తో భారత్ కార్గిల్ యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా హీరోగా నిలిచారు. అనేక కీలకమైన పాయింట్లను చేజిక్కించుకున్నారు. మరణానంతరం అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం పరమవీర చక్ర ఇవ్వబడింది. అతని పరాక్రమానికి గుర్తుగా బాత్రాను “టైగర్ ఆఫ్ ద్రాస్”, “కార్గిల్ సింహం”, “కార్గిల్ హీరో” పిలుస్తుంటారు.
కెప్టెన్ బాత్రా జీవిత కథ ఆధారంగా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా ‘షేర్షా’ చిత్రం 2021లో విడుదలైంది. కార్గిల్ యుద్ధంలో అత్యంత క్లిష్టమైన టార్గెట్ పాయింట్ 4875ని శత్రువుల నుంచి విజయవంతంగా చేజిక్కించుకోవడంలో బాత్రా పరాక్రమం తిరుగులేనిది. కెప్టెన్ బత్రాకు కోడ్ నేమ్ ‘షేర్షా’గా ఇచ్చారు. యుద్ధంలో పేలుడులో కాళ్లకు తీవ్రగాయాలైన లెఫ్టినెంట్ నవీన్ అనబేరు అనే అధికారిని రక్షించేందుకు కెప్టెన్ బాత్రా తన బంకర్ నుంచి పరిగెత్తి కాపాడే క్రమంలో శత్రువుల కాల్పుల్లో మరణించారు.
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..