Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరోసారి పాకిస్తాన్ రేంజర్లు బరితెగించారు. సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై కాల్పలు జరిపారు. ఈ రోజు సాయంత్రం పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. మక్వాల్ లోని సరిహద్దు ఔట్‌పోస్టు వెంబడి బీఎస్ఎఫ్ సిబ్బంది, సరిహద్దు అవతలి వైపు నుంచి వస్తున్న కాల్పులను తిప్పికొట్టారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన కాల్పులు 20 నిమిషాలకు పైగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు. భారత్ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరలేదని వెల్లడించారు.
Black Hole: సైన్స్ అభివృద్ధి చెందే కొద్ది విశ్వంలోని కోటానుకోట్ల వింతల్లో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మన భూమి, సూర్యుడు, సౌర కుటుంబంతో పాటు కొన్ని బిలియన్ల నక్షత్రాలకు కేంద్రంగా ఉన్న మిల్కీ వే(పాలపుంత) గెలాక్సీ ఉంది. కొన్నాళ్ల వరకు పాలపుంత గెలాక్సీ మధ్యలో సూపర్ మాసివ్ ‘బ్లాక్ హోల్’ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, సైన్స్ పురోగతి సాధించడంతో నిజంగా మిల్కీవే కేంద్రంలో బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించారు. సజిటేరియస్ A బ్లాక్ హోట్ భూమి నుంచి దాదాపుగా 26,000 కాంతి…
Tata Motors: టాటా మోటార్స్ సంచలన ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న టాటా తన రెండు నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలపై భారీగా ధరని తగ్గించింది. ఈ రెండు కార్లు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లుగా ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ధర రూ. 1.20 లక్షల వరకు తగ్గనుంది. దీంతో నెక్సాన్ ఈవీ రూ. 14.49 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధర నుంచి ప్రారంభం కానుంది. ఇక టియాగో ఈవీ విషయాని వస్తే దీనిపై రూ. 70,000 తగ్గింపు వర్తించనుంది. దీంతో…
Burj Khalifa: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న దుబాయ్‌లోని ‘‘బుర్జ్ ఖలీఫా’’పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్లే చేసింది. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణం వెలిగిపోయింది.
Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.
Bubonic Plague: 14వ శతాబ్ధంలో ప్రపంచాన్ని భయపెట్టిన, దాదాపుగా ఐరోపాలో 10 లక్షల మంది ప్రాణాలను తీసుకున్న ‘‘బుబోనిక్ ప్లేగు’’ అమెరికాలో గుర్తించారు. యూఎస్ ఓరేగాన్లో ఓ వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించారు. డెస్చుట్స్ కౌంటీలో రోగికి పెంపుడు పిల్లి ద్వారా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లికి, రోగికి మధ్య కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించామని, అనారోగ్యాన్ని నివారించడానికి మెడికేషన్ ఇచ్చామని ఆ ప్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ రిచర్డ్ ఫాసెట్ ఒక ప్రకటనలో చెప్పారు.
Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వెళ్తే, వారిపై షాజహాన్, అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు.
Farmers Protest: పంటకలు మద్దతు ధర(ఎంఎస్పీ)తో సహా 12 డిమాండ్ల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. బారికేట్లు, ముళ్ల కంచెలను దాటుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్న రైతులు, ఆందోళనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. డ్రోన్ల సాయంతో వీటిని ఆందోళనకారులపై పడేస్తున్నారు.
California: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి మరణించారు. 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిలో విగతజీవులుగా కనిపించారు. మరణించిన వ్యక్తుల్ని ఆనంద్ సుజిత్ హెన్రీ, 42, అతని భార్య అలిస్ ప్రియాంక, 40, మరియు వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్ మరియు నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వ్యక్తులపై తుపాకీ గాయాలు కనిపించాయి.