Breaking News: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తిగా నవల్నీకి గుర్తింపు ఉంది.
Law Commission: ఎన్నారైలు భారతీయ పౌరులను ముఖ్యంగా అమ్మాయిలను మోసపూరితంగా వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాసులు, భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో సమగ్ర చట్టాలను తీసుకురావాలని లా ప్యానెల్ సిఫారసు చేసింది. "ప్రవాస భారతీయులు మరియు విదేశీ పౌరులకు సంబంధించిన మ్యాట్రిమోనియల్ ఇష్యూలపై చట్టం"పై ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రీత్ రాజ్ అవస్తీ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు.
Sandeshkhali Clashes: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్‌ఖలీ ప్రాంతం అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని గుండాల అకృత్యాలపై అక్కడి మహిళలు, యువత భగ్గుమంటోంది. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ అల్లర్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
PM Modi: పంటకు కనీస మద్దతు(ఎంఎస్పీ) చట్టంతో సహా 12 హామీలను అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘ఢిల్లీ ఛలో’ పేరుతో దేశ రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, వీరందరిని హర్యానా-ఢిల్లీ బోర్డర్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆందోళన విరమణపై హామీ రాలేదు.
Gulf Stream: భూమిపైన వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కాలుష్యం పెరగడంతో రుతువుల్లో మార్పులు, హిమానీనదాలు వేగం కరిగిపోతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం, ఇదే పరిస్థితులు కొనసాగితే 2025 నాటికి భూమి వాతావరణానికి కీలకమైన ‘‘ గల్ఫ్ స్ట్రీమ్’’ నాశనమవుతుందని, దీని వల్ల రానున్న కాలంలో ‘‘మినీ ఐజ్ ఏజ్’’ ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Kota: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు రాజస్థాన్ లోని కోటా నగరం పేరొందింది. ఇలాంటి ప్రాంతంలో వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైంది. సహ విద్యార్థులు ఈ దారుణాకి ఒడిగట్టారు. నిందితులు కూడా మైనర్లే అని తెలుస్తోంది. ఫిబ్రవరి 13న జరిగిన ఈ దారుణంలో, నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన తన క్లాస్‌మేట్‌తో స్నేహం చేస్తోంది. అతను బాలికను తన అపార్ట్మెంట్కి పిలిచారు. అక్కడ ప్రధాన నిందితుడు తన ముగ్గురు స్నేహితులు…
Mobile Usage: భారతదేశంలో గత 13 ఏళ్లలో స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని, ఇది మానవ ప్రవర్తనల్లో గణనీయమైన మార్పుకు కారణమైంది. బెస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిర్వహించిన ఇటీవల అధ్యయనంలో తేలింది. భారతీయుల్లో 31 శాతం మంది లేవడంతోనే స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారని చెప్పింది. 84 శాతం మంది యూజర్లు నిద్రలేచిన మొదటి 15 నిమిషాల్లోనే తమ ఫోన్లను చెక్ చేస్తున్నారని తెలిపింది.సగటును ఒక స్మార్ట్‌ఫోన్ యూజర్ ఒక రోజులో 70-80 సార్లు పికప్ చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
Delhi HC: భార్యపై ఆమె తల్లిదండ్రుల అతి ప్రభావం కూడా క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వివాహ బంధం ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తూ.. తల్లిదండ్రుల మితిమీరిన ప్రభావానికి లోనైన భార్య, అతని భర్తపై క్రూరత్వానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఓ వ్యక్తి విడాకులు మంజూరు చేసింది. భార్యభర్తల వైవాహిక జీవితంలో కుటుంబ సభ్యులు అనవసరమైన జోక్యాన్ని కలిగి ఉన్నారని, ఇది భర్తకు బాధ కలిగించిందనే సాక్ష్యాలు ఉన్నాయని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో నేతృత్వంలోని…
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పార్టీ వివాదంలో మరోసారి శరద్ పవార్‌కి షాక్ తగిలింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని మహారాష్ట్ర స్పీకర్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేది లేదని స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చి చెప్పాడు. అజిత్ పవార్ వర్గానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉందని ఆయన చెప్పారు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతా సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలన్నింటికి కలిపి 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్(సీఎపీఎఫ్) బలగాలను మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.