PM Modi: మాజీ నేవీ అధికారుల ఉరిశిక్ష రద్దు తర్వాత ఖతార్ ఎమిర్‌తో పీఎం మోడీ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఖతార్ వెళ్లారు. ఇటీవల ఖతార్‌లో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, భారత్ దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకురావడంతో ఖతార్ దిగివచ్చి వారందర్ని విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా ఇండియా చేరుకున్నారు.
Read Also: Farmers Protest: “మోడీ గ్రాఫ్‌ని తగ్గించాల్సిన అవసరం ఉంది”.. రైతు నేత వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు..
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ఇదిలా ఉంటే, ఈ పరిణామం జరిగిన కొన్ని రోజులకే, ఈ రోజు ప్రధాని మోడీ, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో గురువారం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. దోహాలో భేటీ అయిన ఇరువురు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఖతార్ దేశాన్ని ప్రధాని రెండోసారి సందర్శించారు. అంతకుముందు 2016లో ఆ దేశంలో పర్యటించారు. ముఖ్యంగా సీఎన్జీ, చమురు రంగాల్లో ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం.
ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో పలు ఒప్పందాలు చేసుకున్నారు. అబుదాబిలో నిర్మితమైన, గల్ఫ్ లోనే అతిపెద్దదైన హిందూ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!