Jnanpith Award: 2023కి గానూ ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యలకు 58వ జ్ఞానపీఠ్ అవార్డులను కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ హిందీ సినిమాల్లో సినీగేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఉన్న ప్రసిద్ధ ఉర్దూ కవుల్లో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు గుల్జార్‌కి 2002లో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏ 4 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెంపుతో డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ వినియోగదారుల ధరల సూచి(CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉంది. దీని ప్రకారం చూస్తే డీఏ 50.2 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకువచ్చిన ఆడ సింహానికి ‘సీత’ అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆడ సింహానికి ఎలాంటి పేరు పెట్టలేదని పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
Amritpal Singh: ఖలిస్తానీ నేత, వివాదాస్పద వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు అస్సాంలోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఉన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలో భారీ భద్రత కలిగిన జైలులో భద్రత ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నేత, అతని 9 మంది సహచరులు ఉన్న సెల్ నుంచి స్పై కెమెరాలు, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ ఇతర వస్తువులను అధికారులు ఈ రోజు…
Masterdating: ‘డేటింగ్’ నేటి యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్షిప్లో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం చాలా కామన్. అయితే, ప్రస్తుతం యువత కొత్త డేటింగ్ ట్రెండ్‌కి తెరతీసింది. ‘‘ మాస్టర్ డేటింగ్’’ అనే కొత్త డేటింగ్లో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది. మాస్టర్ డేటింగ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంశంపై 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మాస్టర్ డేటింగ్లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే, ఇది డేటింగ్‌తో పోలిస్తే చాలా భిన్నం.…
Kamal Nath: గతేడాది చివర్లో జరిగి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అన్ని తానై నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. మరోవైపు ఆయన కుమారుడు చింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ ఇప్పటికే తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించారు. ఈ నేపథ్యంలో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.
Australia: ఆస్ట్రేలియాకు చెందిన 73 ఏళ్ల వ్యక్తి విచిత్ర సమస్యను ఎదుర్కొన్నాడు. లైంగిక సంతృప్తి కోసం మూత్రనాళంలోకి చిన్న బటన్ సైజ్ బ్యాటరీలను చొప్పించుకున్నాడు. అయితే, వాటిని బటయకు తీయడంతో విఫలం కావడంతో 24 గంటల్లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన కేసు మార్చి నెలలో ‘‘యూరాలజీ కేస్ రిపోర్ట్స్’’లో ఒక అధ్యయనంలో ప్రచురించారు.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ పార్టీలో చీలికలు వచ్చాయి. శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల ఈసీ, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబంలో ఇద్దరు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించడంపై వెస్ట్రన్ దేశాలు పుతిన్‌పై భగ్గుమంటున్నాయి. శుక్రవారం నవల్నీ జైలులో మరణించారు. అతని మరణానికి రష్యా అధ్యక్షుడే కారణం అని.. పుతిన్ "కిల్లర్" అంటూ యూరప్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో ప్రజలు నినదించారు. యూరప్ లోని పలు నగరాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ముఖ్యంగా రష్యన్ ఎంబసీల ముందు నిరసన తెలిపారు. నవల్నీది మరణం కాదని హత్య అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. రోమ్, ఆమ్స్టర్డామ్, బార్సిలోనా, సోఫియా,…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తించారు. మొరెనా జిల్లాలో 34 ఏళ్ల గర్భిణిపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేందుకు నిప్పటించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిల్లో ప్రాణాల కోసం పోరాడుతోందని పోలీసులు శనివారం తెలిపారు. 80 శాతం గాయాలైన మహిళ గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.