Supreme Court: ఒక కుటుంబంలో జీతం తీసుకువచ్చే ఉద్యోగి ఎంత ముఖ్యమో, గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబాన్ని చూసుకునే స్త్రీ విలువ చాలా ఉన్నతమైందని, ఆమె పని అమూల్యమైనదని పేర్కొంటూ.. ఆమె సేవల్ని డబ్బుతో లెక్కించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మోటార్ ప్రమాదం కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచింది.
S Jaishankar: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో యూరప్, అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ భారత్ ముడిచమురు కొనడం ఆపలేదు. పలు సందర్భాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. తాజాగా ఆయన మరోసారి అమెరికా ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఔరా అనిపించారు.
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగింపుపై బీజేపీ జాతీయ మండిలి ఆమోదం తెలిపింది. జూన్, 2024 వరకు ఆయన పదవినీ పొడగించారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జేపీ నడ్డా నాయకత్వాన్ని బీజేపీ పెంచుతూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయానికి ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించింది. అంతేకాకుండా పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు కట్టబెట్టారు.
Ayodhya Temple: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదిక బీజేపీ జాతీయ సమావేశం జరుగుతోంది. భారతదేశంలో రాబోయే వెయ్యేళ్లకు రామరాజ్య స్థాపనకు ఇది నాంది పలుకుతూ, అయోధ్య రామ మందిరంపై ఆదివారం బీజేపీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ చైతన్యంగా దేవాలయం మారిందని తీర్మానం పేర్కొంది. ‘‘ పురాతన పవిత్ర నగరమైన అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో దివ్యవమైన ఆలయాన్ని నిర్మించడం దేశానికి ఒక చారిత్రక, అద్భుత విజయమని, ఇది భారతదేశంలో రాబోయే 1000 ఏళ్ల రామ రాజ్య స్థాపనను తెలియజేస్తుంది. ’’ అని…
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు.
PM Modi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రోజు న్యూఢిల్లీలో బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోడీ దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీయేకు 400పైగా సీట్లు రావాలంటే, బీజేపీ 370 సీట్లు గెలవాల్సి ఉందని ఆయన అన్నారు. తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోడీ అన్నారు. నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదని అన్నారు.
BCAS: ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. చెక్-ఇన్ కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ రెగ్యులేటర్లు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా బ్యూరో ఆప్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) దేశంలోని 7 విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Bees attack: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. పెళ్లికి పిలువని ఆహ్వానితులుగా తేనెటీగలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వివాహానికి హాజరైన బంధువులు ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన గుణ జిల్లాలో ఒక వివాహ వేడుకలో జరిగింది. హోటల్ పైకప్పుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో తేనెటీగలు విరుచుకుపడటంతో వాటి నుంచి తప్పించుకునేందేకు పెళ్లికి హాజరైన బంధువులు ఎటుపడితే అటు పరుగెత్తారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.
S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ సమక్షంలో మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ గత కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మహిళలు, యువత టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి బీజేపీ పార్టీ నుంచి సపోర్టు లభిస్తోంది.