UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యకి పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్‌స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్‌నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్ ఒక నివేదికలో పేర్కొంది.
Read Also: Baba Vanga: 2024లో నిజమవుతున్న బాబా వంగ జోస్యం..
తన వీర్యాన్ని, తండ్రి వీర్యంతో కలిపినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు, దీనిని మహిళకు ఇంజెక్ట్ చేశాడు. స్థానిక కౌన్సిల్ పిల్లాడి డీఎన్ఏ పరీక్ష ద్వారా తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నించిన సమయంలో ఇది చట్టపరమైన ములుపు తీసుకుంది. బాలుడి బయలాజికల్ ఫాదర్‌ని గుర్తించేందుకు పరీక్ష చేయించుకునేలా ఆదేశించాలని కోరుతూ కౌన్సిల్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక కౌన్సిల్‌కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు దీన్ని కొట్టేసింది. ఖచ్చితమైన జనన రికార్డులను నిర్వహించాలనే కౌన్సిల్ ఆసక్తిని అంగీకరిస్తూనే.. ఈ విషయంలో వారికి వ్యక్తిగత ఆసక్తికి అనుమతి ఇవ్వలేమని న్యాయమూర్తి చెప్పారు.
పితృత్వ పరీక్షలకు సంబంధించిన నిర్ణయం కుటుంబంపై ఆధారపడి ఉంటుందని, తన బయలాజిక్ తండ్రి వివరాలను బిడ్డకు తెలియజేయాలని అనుకుంటున్నానా..? అని ప్రశ్నించింది. 5 ఏళ్ల కుమారుడి తల్లిదండ్రుల్ని నిర్ణయించడానికి, డీఎన్ఏ పరీక్షలు చేసుకోమని ఆ వ్యక్తిని బలవంతం చేయడానికి వారికి హక్కు లేదని తీర్పు వచ్చింది. బిడ్డకు, సదరు వ్యక్తితో తండ్రీకొడుకుల సంబంధం ఏర్పడిందని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి కోర్టు ప్రాధాన్యత ఇచ్చింది.