Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది.
Read Also: Israel: పాలస్తీనాను దేశంగా అంగీకరించేది లేదు.. అమెరికా ప్రయత్నాలపై పీఎం నెతన్యాహూ..
వ్యాపారులు, కస్టమర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకునేందుకు కొంచె సమయం ఇచ్చేందుకు గడువును పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ‘‘మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటిలో తదుపరి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లు అనుమతించబడవు’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కస్టమర్లు తమ Paytm పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు మరియు వాలెట్ల నుండి ఆ నిధులు అయిపోయే వరకు నిధులను ఉపసంహరించుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు కానీ మార్చి 15 తర్వాత వారు ఎటువంటి నిధులను స్వీకరించలేదని ఆర్బీఐ తెలిపింది.
ఈ ఖాతాల్లోకి తమ జీతాలు, ప్రభుత్వ సబ్సిడీలతో సహా ఇతర బదిలీలను స్వీకరించే కస్టమర్లు మార్చి 15 నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. పేటీఎం QR కోడ్‌లను ఉపయోగించే వ్యాపారులు ఈ QR కోడ్‌లను Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి కాకుండా ఇతర ఖాతాలకు లింక్ చేసినట్లయితే దానిని కొనసాగించవచ్చు. ఇదిలా ఉంటే సంక్షోభ నివారణ కోసం Paytm పేమెంట్స్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ రిజర్వ్ బ్యాంక్ అధికారులు మరియు ఆర్థిక మంత్రిని కలిశారు.