Ayodhya Temple: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదిక బీజేపీ జాతీయ సమావేశం జరుగుతోంది. భారతదేశంలో రాబోయే వెయ్యేళ్లకు రామరాజ్య స్థాపనకు ఇది నాంది పలుకుతూ, అయోధ్య రామ మందిరంపై ఆదివారం బీజేపీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ చైతన్యంగా దేవాలయం మారిందని తీర్మానం పేర్కొంది. ‘‘ పురాతన పవిత్ర నగరమైన అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో దివ్యవమైన ఆలయాన్ని నిర్మించడం దేశానికి ఒక చారిత్రక, అద్భుత విజయమని, ఇది భారతదేశంలో రాబోయే 1000 ఏళ్ల రామ రాజ్య స్థాపనను తెలియజేస్తుంది. ’’ అని తీర్మానం పేర్కొంది.
Read Also: Karnataka: బడ్జెట్‌లో ముస్లింకు కొంచెం ఎక్కువ ఇచ్చాం.. వివాదాస్పదమైన మంత్రి వ్యాఖ్యలు..
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బీజేపీ సమావేశంలో కొనియాడారు. శ్రీరాముడి ఆలయం నిజంగా జాతీయ స్పృహతో కూడిన దేవాలయమని, శ్రీరాముడి దివ్యమైన ప్రతిష్టను చూసి ప్రతీ భారతీయుడు సంతోషిస్తున్నాడని, రామ మందిర భారతదేశ దార్శనికత, తత్వశాస్త్రం మార్గాలకు ప్రతీగా తీర్మానం పేర్కొంది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వీక్షించారని, భారతీయ నాగరికత, సంస్కృతికి సంబంధించిన ప్రతి అంశంలోనూ రాముడు, సీత, రామాయణం ఉన్నాయని తీర్మానం పేర్కొంది. శ్రీరాముడు ప్రాథమిక హక్కుల స్పూర్తికి మూలమని, రామరాజ్యం అనే ఆలోచన మహాత్మాగాంధీ మనసులో కూడా ఉందని, రామరాజ్యం అనేది నిజమైన ప్రజాస్వామ్య ఆలోచన అని, రాముడి మాటలు, ఆలోచనలే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’కి స్పూర్తి అని తీర్మానం పేర్కొంది.