Israeli flight: ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని డిమాండ్ చేస్తూ రైతులు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు దేశ రాజధానిని ముట్టడించాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని హర్యానా-ఢిల్లీ బార్డర్లో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వారం రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఎస్పీతో సహా మొత్తం 12 డిమాండ్లను రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి.
Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.
Illicit Relationship: చాలా వరకు వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలు హత్యలకు గురైన సంఘటనలను మనం చాలానే చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ సమస్తిపూర్‌కి చెందిన ఓ వ్యక్తి భార్యతో కాకుండా మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇది తెలుసుకున్న భార్య, ప్రియురాలిని చంపాలని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
Kerala: కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) బలవన్మరణాకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Sandeshkhali Violence: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని రోజులుగా నిరసన, ఆందోళనతో అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహన్ అతని అనుచరులు ఆ ప్రాంతంలో మహిళపై అత్యాచారాలు జరపడంతో ఒక్కసారిగా మహిళలు, యువత టీఎంసీ గుండాలకు ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాంతం బీజేపీ వర్సెస్ పోలీసులుగా మారింది.
Port workers union: గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాలకు సైనిక సామాగ్రితో వెళ్లే ఓడల్ని నిర్వహించకూడదని పోర్ట్ వర్కర్స్ యూనియన్ తమ సభ్యులకు పిలుపునిచ్చింది. దేశంలోని 11 ప్రధాన ఓడరేవుల్లో 3500 మందికి పైగా కార్మికులకు ప్రాతినిధ్య వహిస్తున్న వాటర్ ట్రాన్స్‌పోర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్-పాలస్తీనాలకు సైనిక సామాగ్రిని తీసుకెళ్లే మరే ఇతర దేశం నుమచి ఆయుధ కార్గోలను లోడ్ చేయడం లేదా అన్ లోడ్ చేయడం లేదని తెలిపింది. సైనిక సామాగ్రిని తీసుకెళ్లే షిప్‌లను…
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో కఠిన ఆంక్షలు, చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పటికే స్త్రీ విద్యను నిషేధించడంతో పాటు స్త్రీలు ఉద్యోగం చేయడాన్ని తాలిబాన్లు వ్యతిరేకిస్తున్నారు. మహిళల్ని వంటిళ్లకే పరిమితం చేశారు. చివరకు యూఎన్ కార్యక్రమాల్లో పనిచేసేందుకు కూడా వారిని అనుమతించడం లేదు. షరియా చట్టంతో ప్రజలపై తీవ్ర ఆంక్షల్ని విధిస్తున్నారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాబోయే లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను ‘డీయాక్టివేట్’ చేసిందని, తద్వారా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పొందకుండా చేశారని ఆదివారం ఆరోపించారు.
Chhattisgarh: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) 4వ బెటాలియన్‌కి చెందిన తిజౌ రామ్ భూర్యను కిరాతకంగా చంపారు. ఇతను కంపెనీ కమాండర్‌గా పనిచేస్తు్న్నాడు. నక్సలైట్లు భూర్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన బీజాపూర్‌లో చోటు చేసుకుంది.