Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు.
‘‘ ఎస్సీ, ఎస్టీలకు 24 శాతం ఇచ్చామని, ఎందుకంటే వారు వెనుకడి ఉన్నారని, అలాగే ముస్లింలు కూడా వెనకబడి ఉన్నందున వారికి మేము కొంచెం ఎక్కవ నిధులు కేటాయించాం’’అని పరమేశ్వర ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత సీటీ రవి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ మతవాద కాంగ్రెస్ సెక్యులర్ మోడల్’’అని విమర్శించారు. నిధుల కేటాయింపులో కర్ణాటక హోం మంత్రి వ్యాఖ్యలపై సీటీ రవి విరుచుకుపడ్డారు.
Read Also: Gaanja Shankar: టైటిల్ ఇలానా పెట్టేది.. సాయిధరమ్ తేజ్ సినిమాపై నార్కొటిక్ బ్యూరో ఘాటు వ్యాఖ్యలు
మరో బీజేపీ నేత బసనగౌడ ఆర్ పాటిల్ మాట్లాడుతూ.. అన్ని మతాల సహనం, సర్వజాతుల శాంతి వచనాలు, నినాదాలు మీ ప్రసంగానికి పరిమితమా..? అని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును సమానంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ముస్లింలు ఎక్కువ, హిందువులు తక్కు ఈ వివక్ష ఎందుకు..సందర్భాలను బట్టి మాట్లాడటం ద్వారా వీరు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గంలో వ్యవహరిస్తున్నారో లేదో చూడండి అని సూచించారు. మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వక్ఫ్ ఆస్తులకు రూ. 100 కోట్లను కేటాయించితన తర్వాత తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది.