Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ స్పీడ్‌ని పెంచాయి. ఏ క్షణానైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మార్చి 13 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని…
Cross-border marriage: ఇటీవల కాలంలో సరిహద్దు దాటి ప్రేమలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌కి చెందిన పలువురు యువతీయువకులు ప్రేమించుకున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ యువతి, పబ్జీ ద్వారా పరిచయమైన లవర్ సచిన్ కోసం భారత్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. తాజాగా భారత్‌కి చెందిన ఓ యువతి, పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించింది.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు పోరాడుతున్నట్లు సమాచారం ఉంది. భారతీయులు బలవంతంగా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్నట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో భారతదేశం శుక్రవారం తన పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులు ‘‘జాగ్రత్తగా వ్యవహరించాలి, వివాదాలకు దూరంగా ఉండండి’’ అని సూచించింది.
Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సరికొత్త పొత్తు పొడవబోతోంది. అధికార డీఎంకే పార్టీతో కమల్ హాసన్‌కి చెందిన ‘మక్కల్ నీది మయ్యం’ పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పొత్తుపై ప్రకటన వెలువడుతుందని సోమవారం కమల్ హాసన్ తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగానే జరుగుతున్నాయని, మంచి అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
Amethi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అమేథీ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకే రోజు పలు కార్యక్రమాలుకు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ రోజు అమేథీ పట్టణంలోని ప్రవేశిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపి గెలిపించింది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా ఒకేసారి అమేథికి రావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో యూపీ…
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లకు హాజరుకాలేదు. ఈడీ సమన్లను దాటవేయడం ఇది ఆరోసారి. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో.. ఈడీ స్వయంగా కోర్టును ఆశ్రయించిందని.. పదేపదే సమన్లు జారీ చేసే బదులు, ఈ అంశంపై కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని సూచించింది.
Kalki Dham Temple: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో కల్కిధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆలయ శంకుస్థాపన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. యూపీ అంతటా రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ హాయాంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీతో బీజేపీ పాలనను పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
Instagram reel: ఇటీవల కాలంలో యువతకు రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరుకుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా కొందరికి తెలియడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడు పోలీస్ జీపుతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి చిక్కుల్లో పడ్డారు. అతను చేసిన రీల్ వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటునున్నారు. గతంలో టమాటో ధరలు పెరిగిన సందర్భంలో దొంగలు పంటల్ని దోపిడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రైతులు పంట దోపిడి కాకుండా వినూత్న చర్యలు తీసుకుంటున్నారు.