BCAS: ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. చెక్-ఇన్ కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ రెగ్యులేటర్లు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా బ్యూరో ఆప్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) దేశంలోని 7 విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన తర్వాత.. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన తర్వాత 30 నిమిషాల్లోనే అందించాలని, ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు ఆపరేషన్, మేనేజ్‌మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం(OMDA) ప్రకారం నడుచుకోవాలని సూచించారు.
Read Also: Bees attack: పెళ్లికి పిలువని ఆహ్వానితులు.. బంధువులు పరుగో పరుగు.. వీడియో వైరల్..
ఈ చర్యలను అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు అంటే 10 రోజులు గడువు ఇచ్చింది. BCAS జనవరి 2024లో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ఏరియాకి సామాను చేరే సమయాన్ని ట్రాక్ చేసింది. నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇంకా ఎక్కువ సమయం పడుతున్నట్లు గుర్తించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాల్లోపే మొదటి బ్యాగ్ బెల్ట్‌కి చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాల్లోపు చేరుకోవాలని OMDA నిబంధనలు నిర్దేశిస్తాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో తప్పనిసరిగా ఈ ప్రమాణాలను పాటించాలని విమానయాన సంస్థల్ని ఆదేశించింది.