Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohith Vemula: 2016లో హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల మరణం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై హైదరాబాద్ పోలీసులు విచారణను ముగించారు. తాను దళితుడు కాదనే విషయం బయటపడుతుందనే భయంతోనే ఆయన ఆత్మహత్య పాల్పడ్డాడని కోర్టుకు పోలీసులు క్లోజర్ రిపోర్టు సమర్పించారు. అయితే, పోలీసుల విచారణను రోహిత్ వేముల తల్లి అంగీకరించలేదు. దీనిపై మరోసారి విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
READ ALSO: Dinesh Karthik: నాకు బ్యాటింగ్ వస్తుందనుకోలేదు: దినేశ్ కార్తిక్
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రోహిత్ వేముల మృతిపై విచారణలో చాలా వైరుధ్యాలు ఉన్నాయని, ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా తెలంగాణలోని తమ ప్రభుత్వం చూస్తుందని, ఎలాంటి అవకాశాన్ని వదలదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్, కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ రోహిత్ వేముల మరణం బీజేపీ ‘‘దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని’’ పూర్తిగా బయటపెట్టిన ఘోరమైన ఘటన అని అన్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ ఈ కష్టకాలంలో రోహిత్ వేముల కుటుంబానికి అండగా నిలిచిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు క్లోజర్ రిపోర్ట్ జూన్ 2023లోనే తయారైందని ఆయన అన్నారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాంపస్‌లలో కుల, మతపరమైన అఘాయిత్యాల సమస్యల్ని పరిష్కరించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. సామాజిక-ఆర్థిక వెనుకబాటు నుండి వచ్చిన విద్యార్థులెవరూ అదే దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవని కేసీ వేణుగోపాల్ అన్నారు. అంతకుముందు రోహిత్ వేముల తల్లి రాధిక హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో మరోసారి విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు