Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- కరీంనగర్లో 20ఏళ్ళుగా మూడో స్థానానికే కాంగ్రెస్
- ఏ మాత్రం ఫలించని పార్టీ పెద్దల ప్రయోగాలు
- మున్సిపల్ ఎన్నికల్లో చేజారిన కరీంనగర్ కార్పొరేషన్
- గ్రూప్‌వార్ ప్రధాన కారణమని తేల్చిన అధిష్టానం, చర్యలు శూన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చెలాయిస్తున్నా… ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అసలా ఛాయలే లేవా? ముచ్చటగా మూడో స్థానంలో ఫెవికాల్ వేసుకుని ఫిక్స్ అయిపోయిందా? దాన్నుంచి ముందుకు వచ్చే కనీస ప్రయత్నం కూడా జరగడం లేదా? అసలక్కడ థర్డ్ నుంచి ఫస్ట్ ర్యాంక్‌కు రావడం కొందరు పార్టీ ముఖ్య నాయకులకే ఇష్టం లేదా? పక్క పార్టీ నేతలతో లాలూచీ వ్యవహారాలు అక్కడ కాంగ్రెస్‌ను కుంగదీస్తున్నాయా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా కథ?
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం… 90శాతం అర్బన్ ఓట్లే ఉండే ఈ సెగ్మెంట్లో గత ఇరవై ఏళ్లుగా కనీస పోటీ ఇవ్వలేక మూడో స్థానానికే పరిమితం అవుతోంది కాంగ్రెస్. నియోజకవర్గ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి హుస్నాబాద్‌కు మారిపోవడంతో నాయకత్వ కొరత ఏర్పడింది. తర్వాత పార్టీ పెద్దలు అనేక ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో ఉన్న వాళ్ళని కాదని అప్పటికప్పుడు చేరిన ఓ నేతకు టికెట్ ఇచ్చి చేసిన బీసీ ప్రయోగంవిఫలమైంది. పైగా మూడో స్థానం నుంచి కాంగ్రెస్‌ను కదిలించలేకపోయింది.
ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితం రిపీట్ అయింది. దాదాపు మూడు లక్షల ఓటర్లున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లోకి వెళ్లింది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ మున్సిపాలిటీని దక్కించుకోలేకపోవడానికి గ్రూపు వార్ ప్రధాన కారణమని తేల్చేశారు పార్టీ పెద్దలు. కానీ… చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం ఏంటన్నది కేడర్ క్వశ్చన్. అసలు ఈ గ్రూపులను పెద్ద నేతలే ప్రోత్సహిస్తుండటంతో కార్యకర్తలు నలిగిపోతున్నారట. కరీంనగర్ నియోజకవర్గంతో తమకు సంబంధం లేదని కీలక మంత్రులు ఇద్దరు పైకి చెబుతున్నప్పటికీ… తెర వెనుక మాత్రం తమ పట్టు పెంచుకునేందుకు ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంతో కరీంనగర్ కాంగ్రెస్ పరిస్థితి… మీద మెరుగులు- లోపల పురుగులు అన్నట్టుగా మారిందంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌గా వెలిచాల రాజేందర్రావును మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల… ఓ మంత్రి అండదండలతో టికెట్ తెచ్చుకున్నారనేది బహిరంగ రహస్య. అదే నేతకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంతోనే అసలు లొల్లి మొదలైందని అంటున్నారు.
Also Read
తనకు ఇష్టం లేకుండా వెలిచాల ఇన్ఛార్జ్ పదవి దక్కించుకున్నారంటూ నాడు సపోర్ట్ చేసిన సదరు మంత్రిగారే ఇప్పుడు రగిలిపోతున్నారట. దాంతో తనదైన శైలిలో చక్రం తిప్పి కార్పొరేషన్ ఎన్నికల్లో తన మార్క్ చూపించారని, దానికి మరో మంత్రి కూడా వాద్య సహకారం అందించేసరికి కార్పొరేషన్ చేజారిందన్నది లోకల్ విశ్లేషణ. అప్పుడు మొదలైన గ్రూపు వార్.. నువ్వా నేనా అన్న స్థాయికి చేరింది. అది అలా అలా రాజుకుని డీసీసీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడి ముందే కాలర్ పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది. ఇంతకాలం.. ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు మంత్రులు అనుచరులు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా కలిసిపోయారట… ఓ నామినేటెడ్ పదవిలో ఉన్న నేత సదరు మంత్రిగారికి దగ్గరైనట్టు తెలిసింది. నగరంలో తమను కాదని ఎలా పనిచేస్తారో చూస్తాం అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన గాడ్ ఫాదర్‌గా ఉన్న మంత్రి సపోర్టే కారణమని చెప్పుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నప్పటికీ అటు పార్టీ నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ క్యాడర్‌కు, ప్రజలకు దక్కాల్సినవి దక్కడం లేదనే అపవాదు ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ళు మొదటి దశ పూర్తయి రెండో దశకు చేరుకుంటున్నప్పటికీ కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఇంకా ఇందిరమ్మ కమిటీలే పూర్తి కాలేదు. ఇటు కరీంనగర్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని నామినేట్ చేయలేదు.
మిగతా చోట్ల పాలనా కాలం కూడా పూర్తవుతున్న టైంలో ఇక్కడ అస్సలు నియమించకపోవడానికి గ్రూప్ వారే కారణం అంటున్నారు. మరోవైపు డీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ పెద్దలు.. నగర కాంగ్రెస్ కార్యవర్గాన్ని మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు. తమ అనుచరులకే పార్టీ కమిటీల్లో స్థానం కల్పించాలని నాయకులు ఎవరికి వారు ఇచ్చిన లిస్టు చాంతాడంత ఉండటంతో కార్యవర్గ ప్రకటన నిలిపివేశారట. ఇలాంటి వాతావరణంలో… కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో బలంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లను దాటి ఎలా ముందుకు వస్తారన్నది బిగ్ క్వశ్చన్.
అసలు అలా ముందుకు రావడం పెద్ద నేతలకే ఇష్టం లేదనే ఇంట్రస్టింగ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కరీంనగర్లో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. కొందరు కీలక నాయకులు….. కుల సమీకరణలు.. వ్యాపార లావాదేవీలు… లోపాయికారి ఒప్పందాలతో.. పార్టీని అలా ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి లాగుతున్నారన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. రాష్ట్ర పార్టీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెడితే తప్ప.. కరీంనగర్ కాంగ్రెస్ బాగుపడబోదన్నది బాటమ్ లైన్. అన్ని విషయాలు గమనిస్తున్నాం.. అందరి లెక్కలు తేలుస్తామని అంటున్న పార్టీ పెద్దల మాటలు ఆచరణలోకి వస్తాయా..? కీలకంగా ఉన్న ఆ మంత్రుల వ్యూహ చతురతను దాటి కరీంనగర్ కాంగ్రెస్‌ను పార్టీ పెద్దలు పట్టించుకుంటారా…? అన్నది మాత్రం మిలియన్ డాలర్ క్వశ్చన్.
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!