Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు […]
Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది.
Ravi River: సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్‌కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు.
Uttarakhand: దేశంలోనే తొలిసారిగా ‘యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)’ బిల్లును తీసుకు వచ్చి చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్ మరో ప్రతిష్టాత్మక బిల్లుకు సిద్ధమవుతోంది. నిరసనల సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ నేతృత్వంలోని సీఎం పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ‘‘ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు’’ని సోమవారం బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనునంది.
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. రెండు పార్టీల నడుమ గత కొన్ని నెలులగా…
Maratha quota: మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం ఉద్యమిస్తున్న నాయకుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. మనోజ్ జరాంగే ఆదివారం ముంబైకి మార్చ్‌ని ప్రకటించాడు. ఆయన నివాసం వెలుపల తెలుపుతామని అన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేయమని కొంతమందిని ప్రలోభ పెడుతున్నారని, ఈ కుట్రల వెనక దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడని, నన్ను చంపాలనుకుంటున్నాడని, నేను వెంటనే సాగర్ బంగ్లా( ముంబాయిలో మలబార్ హిల్‌లో ఫడ్నవీస్ అధికార నివాసం)కి మార్చ్…
Gaming addict: ఆన్లైన్ గేమింగ్స్‌కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
Ajit Pawar: దేశంలో మెజారిటీ ప్రజలు మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర అదికార కూటమిలో ప్రతీ ఒక్కరూ మోడీని గెలిపించడానికి పనిచేస్తున్నామని అజిత్ పవార్ ఆదివారం అన్నారు. బారామతిలో రైతుల ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
Government data: భారతీయులపై చేసిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆహారంపై తక్కువగా ఖర్చు చేస్తున్నారని, ముఖ్యంగా బియ్యం, గోధుమల వంటి ప్రధానమైన వస్తువులపై తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ప్రాసెస్ చేసిన ఆహారం, టెలివిజన్లు, ఫ్రిజ్‌ల వంటి మన్నికైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వ వినియోగ డేటా వెల్లడించింది. 11 ఏళ్ల తర్వాత కేంద్రం కీలకమైన వినియోగ వ్యయ సర్వే డేటాను వెల్లడించింది.
Honour killing: తమిళనాడులో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి బంధువులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేరంలో అమ్మాయి బావ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రవీణ్(26)గా గుర్తించారు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లికరణై సమీపంలో శనివారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ప్రవీణ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి…