Dulquer Salmaan : మూడు భారీ ప్లాప్స్ నుండి దుల్కర్ సల్మాన్ గ్రేట్ ఎస్కేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధాకొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది.. కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివకార్తీకేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ ఎనౌన్స్ చేసింది సుధ. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజ్రియా కూడా తప్పుకున్నారు. ఆ ప్లేసులోకి శివకార్తీకేయన్, జయం రవి, శ్రీలీలను తీసుకుని మూవీ కంప్లీట్ చేసింది దర్శకురాలు.
పరాశక్తి ఫ్లాప్ నుండే కాదు.. దుల్కర్ మరో రెండు తమిళ డిజాస్టర్స్ నుండి తెలివిగా ఎస్కేప్ అయ్యాడంటోంది మాలీవుడ్. కమల్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్2లో సిద్దార్థ్ రోల్ తొలుత దుల్కర్ కోసం అడిగారని సమాచారం. కానీ డీక్యూ ఇతర ప్రాజెక్ట్స్ వల్ల నో చెప్పాడు. కట్ చేస్తే.. ఇండియన్2 రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ ఒక్కసారే కాదు.. థగ్ లైఫ్‌లో కూడా ఉళగనాయగన్ ఓ రోల్ ఆఫర్ చేస్తే తిరస్కరించాడు దుల్కర్. ఇలా వరుసగా త్రీ డిజాస్టర్స్ నుండి దుల్కర్ తప్పుకోవడంతో లక్కీ బాయ్ అంటోంది మాలీవుడ్. ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ సూపర్బ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ మూడు తమిళ బాంబ్స్ నుండి తప్పించుకున్న దుల్కర్.. మరో కోలీవుడ్ మూవీకి బలయ్యాడు. గత ఏడాది వచ్చిన కాంత ఫిల్మ్ ఫ్లాప్ అయ్యింది. తమిళంలో కోల్పోయిన సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నెక్ట్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఆకాశంలో ఓ తారతో రాబోతున్నాడు ఈ లక్కీ భాస్కరుడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..