Vivo X200T Launch: 6200mAh బ్యాటరీ, 50MP సోనీ-శాంసంగ్ కెమెరా.. ‘వివో ఎక్స్200’ కొత్త లీక్స్ ఇవే!
- త్వరలో వివో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్
- 'ఎక్స్200టీ'ని లాంచ్ చేసేందుకు వివో సన్నాహాలు
- 6200mAh బ్యాటరీ, 50MP సోనీ-శాంసంగ్ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ త్వరలో భారతదేశంలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వివో తన ఎక్స్200 సిరీస్‌లో ‘ఎక్స్200టీ’ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే Vivo X200, Vivo X200 Pro, Vivo X200 FE వంటి మోడల్స్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు ఈ సిరీస్‌లోకి కొత్తగా Vivo X200T 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఈ డివైస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.
లీకైన వివరాల ప్రకారం… వివో ఎక్స్200టీలో 6.67 ఇంచెస్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 1.5K రిజల్యూషన్ ప్యానెల్‌తో రానుందని చెబుతున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ SoC ప్రాసెసర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్‌తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ రానుంది. 5 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ అందించే అవకాశముందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
- OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
Also Read: Virat Kohli: ఛేజింగ్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీకి సాటెవరు!
ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వివో ఎక్స్200టీలో 50MP Sony LYTIA LYT-702 మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో) ఉండనుంది. దీనితో పాటు 50MP Samsung JN1 సెకండరీ సెన్సార్, 50MP LYT-600 థర్డ్ సెన్సార్ ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో 6200mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశముంది. ఇది 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 40W ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే eSIM సపోర్ట్ కూడా అందుబాటులో ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. అసలు ఫీచర్స్ ఏంటో తెలియరావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!