PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందిన ద్వారక ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిందని భావిస్తుంటారు. పీఎం మోడీ అరేబియా సముద్ర నీటి అడుగున ద్వారకాధీశుడికి పూజలు నిర్వహించారు. శతాబ్ధాల క్రితం శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా సముద్ర అడుగు భాగంలో ఉందని హిందువులలు నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న పురాతన ద్వారక నగరం అవశేషాలను చూడవచ్చు. హిందూ గ్రంథాల్లో ఈ…
Mother: అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తల్లి తన సంతోషం చూసుకుంది. తనకు ఓ బిడ్డ ఉందని మరిచి విహారయాత్రలకు వెళ్లింది. 16 ఏళ్ల పసిబిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలి డెట్రాయిట్, ప్యూర్టో రికోకు వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది. 10 రోజుల పాటు ఇంట్లో చూసుకునే వారు లేకుండా బిడ్డ ఉండటంతో మరణించింది. నిందితురాలైన మహిళను ఓహియో రాష్ట్రానికి చెందిన క్రిస్టెల్ కాండెలారియోగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె హత్యానేర విచారణ ఎదుర్కొంటోంది. మహిళ 16 నెలల కుమార్తెను ఒంటరిగా ఇంట్లోనే విడిచిపెట్టినట్లు…
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. వరసగా ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఈ సారి బీజేపీ సొంతగా 375 సీట్లను గెలుచుకోవాలని, ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
Fuel prices: పెట్రోల్-డిజిల్ ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి హింట్ ఇచ్చారు. నాలుగో త్రైమాసికింలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని శుక్రవారం ఆయన చెప్పారు.
Deloitte Analysis: ఆటోమొబైల్ రంగంలోని ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పెట్రోల్/డిజిల్ ఆధారిత ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ICE) సాంకేతిక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు(EV), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV) వరకు వాహన రంగం అభివృద్ధి చెందింది. డెలాయిట్ యొక్క ఇటీవలి గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) ప్రకారం.. 50 శాతం మంది భారతీయ వినియోగదారులు పెట్రోల్/డిజిల్ ఇంజన్ల నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV)లకు ప్రాధన్యత ఇస్తున్నట్లుగా తేలింది. 2023 అక్టోబర్ 5 నుండి 12వ తేదీ వరకు…
Prashant Kishor: లోక్‌సభ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి బీజేపీనే స్వతహాగా 370 సీట్లను సాధిస్తుందని, ఎన్డీయే కూటమి 400కి మించి సీట్లను గెలుస్తుందని ప్రధాని మోడీతో పాటు కేంద్ర నాయకత్వం చెబుతోంది.
Ayodhya Ram Temple: హిందువుల శతాబ్ధాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడులకు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్లాది మంది భారతీయలు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూశారు. అయితే, రామ మందిరం ప్రారంభం అయినప్పటి నుంచి భక్తులు లక్షల్లో అయోధ్యకు వెళ్తున్నారు.
Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని విమర్శించే వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్న అలెక్సీ నవాల్నీ ఇటీవల జైలులో మరణించాడు. అతడిని పుతిన్ ప్రభుత్వం హత్య చేసినట్లు వెస్ట్రన్ దేశాలు విమర్శిస్తున్నాయి. 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న ఆయన అనూహ్యరీతిలో ఇటీవల మరణించారు. ఆర్కిటిక్ పీనల్ కాలనీలో వారం క్రితం హఠాత్తుగా మరణించారు. అయితే, ఇప్పటి వరకు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించలేదు.
New Criminal Laws: బ్రిటీష్ కాలపు వలస చట్టాల స్థానంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 న్యాయ చట్టాలను తీసుకువచ్చింది. భారతీయ న్యాయ సంహిత-2023 శతాబ్ధం నాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) స్థానంలో రాబోతోంది. జూలై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త చట్టం ఐపీసీని 511 నుంచి 358 సెక్షన్లకు తగ్గించి, 20 నేరాలను జోడించింది. క్రిమినల్ చట్టాల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది.
BJP: లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇటీవల ఢిల్లీ వేదికగా నేతలతో జాతీయ సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలను, ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే అవకాశం…