Point Nemo: భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం..అంతరిక్ష శ్మశానవాటికగా పేరు.. దీని విశేషాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది. ఈ పాయింట్ నిమో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్లు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ల దూరంలో ఉంది.
Read Also: Ravi River: పాకిస్తాన్‌కి షాక్.. రావి నది నీటిని నిలిపేసిన భారత్..
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
భూమిపైనే అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో, ఈ ప్రాంతానికి సమీపంలో మానవ సంచారం లేకపోవడంతో అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా చేస్తుంటారు. కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వస్తువులను ఈ ప్రాంతంలో కూలిపోయేలా చేస్తారు. 2030లో ఐఎస్ఎస్ కాలం కూడా ముగిసిపోతుంది, ఆ సమయంలో ఐఎస్ఎస్ ‘పాయింట్ నిమో’ వద్దే కూలి సముద్రగర్భంలో కలిసిపోతుంది. అందుకే దీనిని ‘అంతరిక్ష వ్యర్థాల శ్మశానవాటిక’గా పిలుస్తుంటారు.

భూమిపై అత్యంత సుదూర ప్రదేశం పాయింట్ నెమోని కొన్నిసార్లు ‘ఓషియానిక్ పోల్ ఆఫ్ అక్సెసిబిలిటీ’ లేదా ‘దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతం’గా సూచిస్తారు. 1992లో, కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్ర్వోజే లుకటేలా దాని ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను గుర్తించాడు. 2019 అధ్యయనం ప్రకారం..ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయాయి. నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చబడ్డాయి. నిజానికి ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ.. ఈ సముద్రం అడుగుభాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయి.
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!