Uttarakhand: దేశంలోనే తొలిసారిగా ‘యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)’ బిల్లును తీసుకు వచ్చి చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్ మరో ప్రతిష్టాత్మక బిల్లుకు సిద్ధమవుతోంది. నిరసనల సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ నేతృత్వంలోని సీఎం పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ‘‘ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు’’ని సోమవారం బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టనునంది.
Read Also: Bharat Jodo Nyay Yatra: సీట్ల పంపకం కుదిరింది.. రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్ యాదవ్..
ఈ బిల్లు ప్రకారం.. నిరసన, సమ్మెల సమయంలో జరిగిన నష్టాన్ని అందులో పాల్గొన్న నిందితుల నుంచి వసూలు చేస్తారు. నష్టాన్ని భర్తీ చేసేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 2020లో ఈ బిల్లును ఆమోదించింది. కొన్ని రోజుల క్రితం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.
మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ఒకే చట్టాలను అమలు చేయాలనే లక్ష్యంతో యూసీసీ బిల్లును తీసుకువచ్చింది. ఫిబ్రవరి 7న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, శాసనసభలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) బిల్లు ఆమోదం పొందడం “ఉత్తరాఖండ్ చరిత్రలో చారిత్రాత్మక రోజు”గా అభివర్ణించారు.