Honour killing: తమిళనాడులో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి బంధువులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేరంలో అమ్మాయి బావ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రవీణ్(26)గా గుర్తించారు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లికరణై సమీపంలో శనివారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ప్రవీణ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.
Read Also: PM Modi: అరేబియా సముద్రం నీటి అడుగున పూజలు నిర్వహించిన పీఎం మోడీ.. ఫోటోలు వైరల్..
ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులు స్టీఫెన్ కుమార్, జోతి లింగం, శ్రీరామ్, అశోక్, విష్ణు రాజ్, దినేష్‌లను అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం ప్రవీణ్, షర్మిలలు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. శనివారం ప్రవీణ్ భోజనం తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బటయకు వెళ్లిన సందర్భంతో షర్మిల సోదరుడు దినేష్, మరో నలుగురు ప్రవీణ్‌ని చుట్టుముట్టి దాడి చేశారు. ఆహారం తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి రెండు గంటలు గడిచినా ఇంటికి తిరిగి రాలేదని, నా కోడులు ఏడవడంతో ఏదో తప్పు జరిగిందని భావించానని, అప్పుడే విషయం తెలిసిందని ప్రవీణ్ తండ్రి గోపి కన్నీరుమున్నీరయ్యారు. నిందితులందరికి కఠిన శిక్ష పడాలని కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోంది.