Israel-Hamas War: గాజాలో ఆకలి కేకలు.. కలుపు మొక్కలు, పశుగ్రాసమే ఆహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు పారిపోతున్నారు.
Read Also: Point Nemo: భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం..అంతరిక్ష శ్మశానవాటికగా పేరు.. దీని విశేషాలు ఇవే..
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
దక్షిణంగా ఈజిప్టు వైపుగా ప్రజలు ఆహారాన్ని వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు. అక్కడ దుర్భరమైన ఆకలి కేకలు వినిపిస్తున్నాయని, ఆ పరిస్థితులను వర్ణించలేనివిగా ఉన్నాయని గాజా ప్రజలు చెబుతున్నారు. పాలు లేకుండా, పశుగ్రాసంతో తయారు చేసిన రొట్టెలను పిల్లలకు పెడుతుండటం అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. తినడానికి తిండి లేకపోవడంతో స్థానికంగా పెరిగే మాలో అనే మొక్కలను ఆహారంగా తీసుకుంటున్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉత్తర గాజాను టార్గెట్ చేసింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. దీంతో లక్షలాది మంది దక్షిణం రఫా బోర్డర్ వైపు వెళ్తున్నారు. గాజాలో 28 లక్షల మందిలో 80 శాతం మంది ఇప్పటికే దక్షిణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. భీకర దాడుల్లో ఆహారం, మందులు వంటి మానవతా సాయాన్ని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూఎన్ ఫుడ్ ప్రోగ్రాం కూడా నిరాశ స్థాయికి చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. మానవతా సాయం నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితులు ఘోరంగా మారాయి. కొంతమంది నివాసితులు కుళ్లిన మొక్కజొన్న, పశుగ్రాసం, గుర్రాల మాంసం, చెట్ల ఆకుల్ని కూడా తింటున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!