Google: గూగుల్ యూటర్న్ తీసుకుంది. ఇటీవల రుసుము చెల్లించలేదని చెబుతూ పలు భారతీయ యాప్‌లను తొలగించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో తొలగించిన యాప్‌లను గూగుల్ మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి, లోకల్ ఇంటర్నెట్ స్టార్టప్స్ నునంచి తీవ్ర విమర్శలు రావడంతో తన వైఖరిని మార్చుకుంది. మ్యాట్రిమోనీ.కామ్ వంటి ప్రసిద్ధ యాప్‌లో సహా 100 కంటే ఎక్కువ భారతీయ యాప్‌లను గూగుల్ శుక్రవారం తొలగించింది.
Read Also: India Not A Nation: “భారత్ ఒక దేశం కాదు”.. డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా కూటమి..
‘‘సహకార స్ఫూర్తితో, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లతో డెవలపర్‌ల యాప్‌లను మేము తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నాము’’ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. తొలగింపు ప్రక్రియ తర్వాత గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా మరియు ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ మధ్య క్లోజ్డ్ డోర్ మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడిందని విశ్వసనీయ సమాచారం.
దేశంలో యాంటీట్రస్ట్ అధికారులు 15-30 శాతం రుసుము అమలు చేయవద్దని ఆదేశించిన తర్వాత, యాప్ చెల్లింపులపై గూగుల్ 11%-26% రుసుమును విధించకుండా ఆపడానికి కొన్ని భారతీయ స్టార్టప్‌లు చేసిన ప్రయత్నాలతో సమస్య ఏర్పడింది. స్టార్టప్స్ సుప్రీంకోర్టుతో సహా పలు కోర్టుల్లో, యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ ముందు గూగుల్ విధానాన్ని సవాల్ చేశాయి. రాబోయే నెలల్లో స్టార్టప్స్ అలాగే గూగుల్ దీర్ఘకాలిక పరిష్కారానికి రావచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నట్ల సమాచారం. ఆయన శనివారం మాట్లాడుతూ.. యాప్స్ తొలగించాలని గూగుల్ నిర్ణయం అనుమతించడం సాధ్యం కాదని విమర్శించారు.