PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడిన కర్ణాటకకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. షోరాపూర్ తాలుకాలోని రంగంపేటకు చెందిన మహ్మద్ రసూల్ కద్దారే అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని యాద్గీర్ జిల్లా ఎస్పీ జి సంగీత ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం అన్ని విషయాలు వెల్లడించలేదని చెప్పారు. షోరాపూర్ పోలీసులు కద్దరేపై ఐపీసీ సెక్షన్లు 505 (1) (బి), 25 (1) (బి) మరియు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read Also: Rahul Gandhi: జై శ్రీరామ్, మోడీ నినాదాలు, బంగాళాదుంపలతో రాహుల్ గాంధీకి స్వాగతం..
తన ఫేస్‌బుక్ వాల్‌పై మహ్మద్ రసూల్ ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ప్రధానిని బెదిరించడంతో పాటు బీజేపీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ, అటల్ బిహారీ వాజ్‌పేయిలా సుపరిపాలన అందించడం లేదని, మీరు టీ అమ్ముతున్నారు, బీజేపీ లేకుండా మీరు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్స్ చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరాలు తెగిపోతాయి, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ వ్యాఖ్యానించాడు.