Indian Air Force: యువతికి అన్నయ్య లేని లోటును తీర్చారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండోలు. దగ్గరుండీ యువతి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. అన్నీ తామై ఎలాంటి లోటు రాకుండా పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తన అన్నయ్య విధి నిర్వహణలో వీరమరణం పొందినప్పటికీ, ఆయన లేని లోటు గుర్తుకు రాకుండా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. 2017లో బీహార్‌లో మరణించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దళ కమాండో సోదరి వివాహానికి గరుడ యూనిట్‌కి చెందిన కమాండోలు హాజరై పెళ్లి తంతును నిర్వహించారు.
Read Also: NDA: బీజేపీ కూటమిలోకి నవీన్ పట్నాయక్.. 15 ఏళ్ల తర్వాత బీజేడీ హింట్..
2017లో జమ్మూ కాశ్మీర్లో హత్యకు గురైన కమాండో జ్యోతి ప్రకాష్ నిరాలా సోదరి వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించాలని గరుడ యూనిట్ కమాండోలు నిర్ణయించుకున్నారు. జ్యోతి ప్రకాష్‌కి భారత ప్రభుత్వం అశోక చక్ర అందించింది. ఈ కమాండోలు వధువు సునీతా కుమారి వివాహంలో పెళ్లి కార్యక్రమాలను నిర్వహించారు. తన అన్నయ్య బతికి ఉంటే చెల్లిలి పెళ్లిలో ఎలా సహాయపడేవాడో అలాగే గరుడ కమాండోలు పెళ్లి చేశారు.
సునీతా కుమారి బీహార్ పోలీస్‌లో సబ్ ఇన్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. బక్సర్‌కి చెందిన మరో ఎస్ఐ రాహుల్ కుమార్‌తో వివాహం జరిగింది. ముగ్గురు అక్కాచెల్లిళ్లకు నిరాలా ఏకైక సోదరుడు. అంతకుముందు అతని రెండో సోదరి వివాహం 2019లో జరిగిన సందర్భంలో కూడా 11 మంది గరుడ కమాండోలు వివాహానికి హజరై, పెళ్లి కార్యక్రమాలను నిర్వహించారు.
16 गरुड़ कमांडो शहीद कमांडों के बहन की शादी में पहुंचे और अपनी हथेलियों पर चलाकर बहन को बिदा किया! 💐❤️💐
बिहार का बिक्रमगंज एक बार फिर अनोखी शादी का गवाह बना
18 नवंबर 2017 को कश्मीर मे शहीद अशोक चक्र से सम्मानित शहीद ज्योति प्रकाश निराला सर की तीसरी बहन सुनीता जी की कल शादी pic.twitter.com/Da7LGOrLhw— SHAHEED (@SHAHEED15081947) March 6, 2024