DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) పెంపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1, 2024 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం పెంచడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.ఈ నిర్ణయం వల్ల 48.67 లక్షల మధ్య ఉద్యోగులకు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బేసిక్ పేపై 46 శాతం డీఏ పొందుతుండగా, 4 శాతం పెంపుతో 50 శాతానికి చేరనుంది. డీఏ అనేది ద్రవ్యోల్భణ ప్రభావాన్ని భర్తీ చేయడానికి రూపొందించిన జీతంలోని ఒక భాగం. ఇది ఉద్యోగుల మొత్తం వేతనాన్ని పెంచుతుంది.
Read Also: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..4 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం..
డీఏ, డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపుదల పరిమితిని అఖిల భారత CPI-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తే, పెన్షనర్లకు డీఆర్ ఇస్తారు. ఈ రెండింటిని ఏడాదికి రెండుసార్లు జనవరి, జూలైలో పెంచుతారు. చివరిసారిగా అక్టోబర్ 2023లో డీఏని 4 శాతం పెంచడం ద్వారా, 46 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ద్రవ్యోల్భణ రేటును పరిగణలోకి తీసుకుని 4 శాతం డీఏని పెంచారు.
#WATCH | Union Cabinet approves hike in Dearness Allowance to govt employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/IsWUnwBGHW
— ANI (@ANI) March 7, 2024