Manoj Sharma: 12th ఫెయిల్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా విధువినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే, తాజాగా 12th ఫెయిల్ రియల్ హీరో మనోజ్ కుమార్ శర్మకు ప్రమోజన లభించింది. మహారాష్ట్ర పోలీస్‌లో డిప్యూటీ ఇన్సెపెక్టర్ జనరల్ (DIG) నుండి ఇన్స్పెక్టర్ జనరల్ (IG) స్థాయికి పదోన్నతి పొందారు. 2003,2004,2005 బ్యాచ్‌ల ఐపీఎస్ అధికారులకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) పదోన్నతులకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. మనోజ్ కుమార్ శర్మ తన ప్రయాణం గురించి చెప్పారు. తన కష్టమైన కెరీర్లో మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ASP నుండి ప్రారంభమైన ప్రయాణం భారత ప్రభుత్వ ఆదేశంతో IG అయ్యేందుకు ఈరోజుకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Read Also: Flipkart: అతని ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు.. రూ.10,000 చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌కి ఆదేశం..
ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘ కంగ్రాట్స్, మనోజ్ సర్, మీ స్టోరీ మాకు స్పూర్తినిచ్చింది, మీరు దీనికి అర్హులు’’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘అభినందనలు, యువ తరానికి మీరు నిజమైన స్పూర్తి’’ అని, ‘‘ఈ దేశానికి మీ లాంటి ముక్కుసూటి, నిజాయితీ గల అధికారులు కావాలి’’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 12th ఫెయిల్ సినిమా గతేడాది రిలీజై భారీ విజయం సాధించింది. మనోజ్ కుమార్ శర్మ పాత్రను విక్రమ్ మాస్సే అద్భుతంగా పోషించారు.
ASP से शुरू हुई यात्रा आज के भारत सरकार के ऑर्डर से IG बनने तक जा पहुँची है। इस लंबी यात्रा में साथ देने के लिए मन से सभी का आभार🙏🙏 pic.twitter.com/LEITH1OVVp
— Manoj Sharma (@ManojSharmaIPS) March 15, 2024