Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్‌బోర్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: ఇటీవల కాలంలో అడ్రస్ కనుక్కోవడం చాలా సులభంగా మారింది. గూగుల్ మ్యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయంలో సరైన మార్గాలను ఎంచుకోవడం సులభంగా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో మాత్రం గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పోయిన వాళ్లు ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తే, చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడేయడం మనం చూస్తున్నాం.
గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ఎప్పుడూ మిస్ కానప్పటికీ.. ఇది ఎల్లప్పుడు ఖచ్చితమైనందని కాదు. కొన్ని సార్లు తప్పుడు గమ్యస్థానాలను తీసుకెళ్లడం చూస్తున్నాం. ఇదిలా ప్రస్తుతం ఓ సైన్‌బోర్డు తెగ వైరల్ అవుతోంది. స్థానిక ప్రజలు ప్రయాణికుల రక్షణ కోసం గూగుల్‌ని ఉద్దేశించి ఈ బోర్డును ఏర్పాటు చేశారు. గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించేందుకు ఓ బోర్డును ఏర్పాటు చేశారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Read Also: Imran Khan: ‘‘పాకిస్తాన్‌లో ఈవీఎంలు ఉంటే’’.. ఎన్నికలపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు..
కొడగు కనెక్ట్ ఎక్స్ హ్యాండిల్ ఈ సైన్ బోర్డు చిత్రాన్ని పంచుకుంది. ‘‘గూగుల్ ఈస్ రాంగ్. ఈ రహదారి క్లబ్ మహీంద్రాకు వెళ్లదు’’ అని రాసి ఉన్న సైన్‌బోర్డు ఫోటోను ట్వీట్ చేసింది. ఇది ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా ట్వీట్స్ చేస్తున్నారు. ‘‘ ఇండియా ఈస్ నాట్ బిగినర్స్’’అని, మరొకరు ‘‘హాహహ గూగుల్ ఆంటీ ఈ రోజుల్లో చాలా తప్పుగా ఉంది’’ అని కామెంట్స్ చేశారు. కొంతమంది తమ సొంత అనుభవాలను కూడా పంచుకున్నారు. ఎల్లప్పుడూ గూగుల్ మ్యాప్స్ సరికావని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. కుక్కే సుబ్రమణ్య నుంచి మడికేరికి వెళ్తున్న సమయంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా 80 కి.మీ ఎక్కువగా ప్రయాణించి, చివరకు స్థానిక వ్యక్తి ద్వారా సరైన మార్గాన్ని పొందామని ఓ నెటిజన్ తన సొంత అనుభవాన్ని తెలిపారు.
Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1
— Kodagu Connect (@KodaguConnect) March 14, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!