IVF Case: దివంగత పాప్ సింగర్ సిద్ధు మూసేవాలా తల్లి ఇటీవల ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది. అయితే, 21-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు మాత్రమే ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అర్హులనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ వయసు 58 ఏళ్లు. మే 29, 2022లో పంజాబ్ మాన్సాలో 28 ఏళ్ల సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన తల్లిదండ్రులు…
Zomato: తీవ్ర విమర్శల నేపథ్యంలో జొమాటో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శాఖాహారుల కోసం ‘‘ఫ్యూర్ వెజ్’’ ఫ్లీట్ ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం డెలివరీ బాయ్స్‌కి సరికొత్త ఆకు పచ్చ డ్రెస్‌కోడ్, గ్రీన్ కలర్ బ్యాగ్ ఉంటుందని నిన్న ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. శాఖాహారుల కోసం ఇకపై శాకాహార రెస్టారెంట్ల నుంచి ఈ గ్రీన్ ఫ్లీట్ ద్వారా డెలివరీలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని కులతత్వంగా, మతపరంగా వివక్ష చూపిస్తున్నారంటూ…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వివాహిత మహిళతో లేచిపోయిన ఓ వ్యక్తి దారుణమైన శిక్ష విధించారు. తీవ్రంగా కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఈ ఘటన ఉజ్జయినిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే, బాధిత వ్యక్తి కానీ, ఇతరులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంగించారని డీఎంకే ఫిర్యాదులో పేర్కొంది. ‘‘ఎంకే స్టాలిన్ పార్టీ దేవాలయాల నుంచి డబ్బును దొంగిలించి హిందూ మతాన్ని నాశనం చేస్తుంది’’ అని ఆమె ఇటీవల ఆరోపించారు. డీఎంకే పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
TCS: భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్‌సైట్ ఉద్యోగులు 7-8 శాతం వరకు జీతాల పెంపును పొందవచ్చు, అయితే ఆన్సైట్ సిబ్బందికి మాత్రం 2-4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. ఈ ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీతాల పెంపు ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉందని సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే మెరుగైన పనితీరు ప్రదర్శించిన వారికి 12-15 శాతం…
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘జొమాటో’(Zomato) శాఖాహారుల కోసం సరికొత్తగా రాబోతోంది. శాఖాహార వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ని ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం ‘‘ప్యూర్ వెజ్ ప్లీట్’’ ద్వారా డెలివరీలు అందించబడుతాయి. జొమాటో సాంప్రదాయ డ్రెస్ కోడ్‌కి బదులుగా గ్రీన్ యూనిఫాం, గ్రీన్ డెలివరీ బ్యాగ్స్‌ని కలిగి ఉంటుంది. గతంలో వీరికి రెడ్ యూనిఫాం, రెడ్ డెలివరీ బాక్సులు ఉండేవి. ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్ కోడ్ నాన్-వెజ్‌కి పరిమితం కానుంది.
Man stabs wife: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజనం ఆలస్యమైందని ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా పొడిచి చంపాడు. 30 ఏళ్ల పరస్రామ్,28 ఏళ్ల తన భార్య ప్రేమాదేవీని చంపేశాడు. రాష్ట్రంలోని సీతాపూర్‌లో థాంగావ్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కొత్వలన్పూర్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తో్ంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి.
Junk Food: జంక్ ఫుడ్ తినడం ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైంది. జంక్ ఫుడ్ తిన్నందుకు తండ్రి మందలించడంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఈ రోజు వెల్లడించారు. నగరంలోని సింధీ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది.
India Growth: ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉంటే భారత్ మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కూడా ఇదే విషయాన్ని చెప్పింది. భారతదేశం 8 శాతం వార్షిక జీడీపీ వృద్ధిని కొనసాగించగలదని సెంట్రల్ బ్యాంక్ మార్చి బులెటిన్‌లో ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ కథనంలో పేర్కొంది. 2021-24 కాలంలో, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి సగటున 8 శాతం కంటే ఎక్కువగా ఉంది.