Ambati Rambabu Bhogi Dance: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ( జనవరి 14న) వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో జోరుగా హుషారుగా స్టెప్పులు వేశారు. ఇక, నేను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు చేయాలి.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా.. కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నాను అని అంబటి పేర్కొన్నారు.
Read Also: Virat Kohli Record: ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. మొదటి బ్యాటర్‌గా ‘కింగ్’ కోహ్లీ రేర్ రికార్డు!
అయితే, సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను కాబట్టి సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అలా మాట్లాడే వాళ్లు ఆ పని చేయలేరు.. ఎందుకంటే నేను పొలిటీషియన్‌ను.. వాళ్లు కాదు కాబట్టి అని కూటమి ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం.. గవర్నమెంట్ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలి.. ఆ జీవోను ఉపసంహరించుకునే వరకు మా పోరాటం ఆగదు.. ఈ ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితే కూటమి సర్కార్ ప్రశ్నిస్తామని అంబటి అన్నారు.